భారత సంతతి క్రికెటర్‌ తల నరికేసారు

Indian Cricketer Murdered in South Africa

07:23 PM ON 18th November, 2015 By Mirchi Vilas

Indian Cricketer Murdered in South Africa

భారత్‌ క్రికెట్‌కి చెందిన మానసిక వికలాంగుడైన నవాజ్‌ఖాన్‌ (23) ని అత్యంత ఘోరమైన రీతిలో హత్య చేసారు. దక్షిణాఫ్రికాకి చెందిన స్నేహితుడు తండోవాఖే డుమా నవాజ్‌ఖాన్‌ను దారుణంగా తల నరికి హత్యచేసాడు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం డుమా ఇంటి పక్కనే ఉన్న అడవిలోకి తీసుకువెళ్ళి స్నేహితుడైన నవాజ్‌ఖాన్‌ని కత్తులతో దాడి చేసి తల నరికేశాడట. పోలీసులు డుమాను అనుమానించి విచారించిన సమయంలో తన కష్టాలు తొలగిపోవాలంటే నరబలి ఇవ్వాలని ఒక భూతవైద్యుడు చెప్పగా నవాజ్‌ ఖాన్‌ని తీసుకువెళ్ళి తల నరికేశానని పోలీసుల విచారణలో అంగీకరించాడు. పోలీసులు డూమాతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసారు. ఖాన్‌ మానసిక వికలాంగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2013 అవార్డుకు ఎంపికయ్యాడని, ఆ అవార్డు దక్షిణాఫ్రికా క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లా చేతుల మీదుగా అందుకున్నాడని అతని తల్లి జకియాఖాన్‌ తెలిపింది. త్వరలో నవాజ్‌ఖాన్‌ అతని టీంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్ళాల్సి ఉండగా, ఇంతలో ఈ దారుణం జరిగిందని దక్షిణాఫ్రికా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ అధికార ప్రతినిధి ఆల్బర్ట్‌ వార్నిక్‌ తెలిపాడు.

English summary

Indian Cricketer Murdered in South Africa