రేప్ కేసులో భారత క్రికెటర్!

Indian cricketer that who arrested and released in Zimbabwe rape case

10:37 AM ON 21st June, 2016 By Mirchi Vilas

Indian cricketer that who arrested and released in Zimbabwe rape case

జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు పై గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరోపణలు వచ్చాయి. ఆ దేశానికి చెందిన యువతి పై అత్యాచారానికి పాల్పడినట్టు స్థానిక మీడియాలో వార్తలు రావడం సంచలనంగా మారాయి. దీంతో ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. భారత క్రికెటర్లు ఎవరూ అత్యాచారం కేసులో అరెస్టు కాలేదంటూ వివరణ ఇచ్చింది. ఇంతవరకు బానే ఉంది. అయితే, అత్యాచారం ఆరోపణల్లో ఈ సిరీస్ ను స్పాన్సర్ చేస్తున్న సంస్థకు చెందిన ఓ వ్యక్తి ఉన్నట్టు చెబుతున్నారు. అదే సయమంలో ఓ భారత క్రికెటర్ పాత్ర కూడా ఉన్నట్టు టాక్ నడుస్తోంది.

దీంతో ఆగ్రహించిన ఆ క్రికెటర్ తాను అలాంటివాడిని కాదనీ, అవసరమైతే డీఎన్ఏ టెస్టుకు సిద్ధమంటూ ప్రకటించినట్టు కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. ఇది సరే గానీ, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్న చందంగా, అసలు రేప్ కేసులో సంబంధం లేకుండా ఆ క్రికెటర్ ఇలా ఎందుకు ప్రకటించారన్న దాని పై ఇపుడు చర్చ జరుగుతోంది. పైగా, ఆ క్రికెటర్ ఎవరన్న దాని పై మీడియా ఆరా తీస్తున్నట్టు సమాచారం. కాగా, ఈ అంశం పై బీసీసీఐ వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. నిజానిజాలు పూర్తిగా తెలియకముందే వ్యాఖ్యానించడం తగదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భారత్ శనివారం జరిగిన తొలి మ్యాచ్ లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అంతకుముందు జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే టోర్నీని భారత్ కైవసం చేసుకున్న విషయం తెల్సిందే.

English summary

Indian cricketer that who arrested and released in Zimbabwe rape case