క్రికెటర్లు బ్యాట్ పై స్టికర్స్ కు ఎంత తీసుకుంటారో తెలుసా?

Indian Cricketers income for company brand stickers on their bats

05:08 PM ON 2nd April, 2016 By Mirchi Vilas

Indian Cricketers income for company brand stickers on their bats

క్రికెట్ లో సాధారణంగా ఏ బ్యాట్స్ మెన్ అయినా అప్పటి వరకు ఫామ్ కోల్పోయి అనూహ్యంగా అవసరమైన మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చి ఆ మ్యాచ్ నే గెలిపిస్తే అతను ప్రేక్షకుల గుండెల్లో చిరస్దాయిగా నిలబడిపోతాడు. అయితే ప్రేక్షకులు ఆటగాడి పై మక్కువ చూపిస్తే ఆ ఆటగాడు మాత్రం ఆ రోజు ఆడినా బ్యాట్ పై మక్కువ చూపిస్తాడు. ఆ బ్యాట్ తోనే ప్రతీ మ్యాచ్ ఆడటానికి ఇష్టపడతాడు. ఇదిలా ఉంటే అప్పుడప్పుడు క్రికెట్ అభిమానులు ఏ క్రికెటర్ ఏ బ్యాట్ వాడుతున్నాడని చర్చికుంటూ ఉంటారు. తమకి ఇష్టమైన బ్యాట్స్‌మెన్ వాడే బ్యాట్ గురించి చెప్పుకుంటూ ఉంటారు. ధోనీ అయితే స్పార్టన్ అని, యువరాజ్ సింగ్ అయితే పూమా అని, విరాట్ కోహ్లీ అయితే ఎమ్ఆర్ఎఫ్ బ్యాట్ వాడుతున్నాడని చర్చికుంటూ ఉంటాం.

అయితే అందరికీ తెలియని విషయం ఏమిటంటే ప్రచారం కోసం ఆ బ్యాట్ల పై స్టిక్కర్స్ వాడమని ఆ కంపనీ లు(పూమా, ఎమ్ఆర్ఎఫ్, సీట్) ఆటగాళ్లతో ఒప్పొందం కుదుర్చుకుంటాయి. అందుకు గానూ ఆ కంపనీ లు ఆ ఆటగాళ్లకి కోట్లు కుమ్మరిస్తాయి. ఇండియన్ క్రికెటర్లకు జీతాలు తో పాటు... ఎండార్స్మెంట్, స్పాన్సర్ రకరకాల ఆదాయాలున్నాయి. వాటితో పాటు స్టిక్కర్స్ తో కోట్లలో ఆదాయాన్ని గడిస్తున్నారు. వారిలో మన ఇండియన్ ఆటగాళ్లు స్టికర్స్ పై ఎంతెంత సంపాదిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఇందులో మన ఇండియన్ ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాలు కూడా ఇద్దరు ఉన్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఇష్టపడే బ్యాట్స్ మెన్ లలో వీరిద్దరూ స్థానం సంపాదించారని ఎండార్స్మెంట్ ప్రతినిధులు తెలిపారు.

1/10 Pages

ధోని: (6 కోట్లు)


భారత జట్టు సారధి మహేంద్ర సింగ్ ధోని వాడే స్పార్టన్(SPARTAN) బ్యాట్ పై ఉండే స్టిక్కర్ ఖరీదు అక్షరాల రూ. 6 కోట్లు... ఆ కంపనీ స్టికర్ వాడుతున్నందుకు ఆ కంపనీ వాళ్ళు ధోని కి సంవత్సరానికి 6 కోట్లు పారితోషకం ఇస్తుంది. దీనితో పాటు ధోని టీవీ యాడ్స్ చేస్తే ఒక్కొక్క కంపనీ రూ. 8 కోట్లు పారితోషికం ఇస్తుంది.

English summary

Indian Cricketers income for company brand stickers on their bats. They use different brands stickers in their bats.