2015లో భారత్‌లో ఎఫ్‌డిఐలు డబుల్

Indian FDI Double In 2015

10:36 AM ON 22nd January, 2016 By Mirchi Vilas

Indian FDI Double In 2015

2015లో భారత్‌దేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం దాదాపు రెట్టింపు స్థాయిలో కొనసాగిందట. ఇండియాలో పెట్టుబడులు పెట్టడంలో అమెరికా అగ్రస్థానంలో వుందట. ఈ విషయాన్ని ఐరాస వాణిజ్యాభివృద్ధి సంస్థ (అంక్టాడ్‌) వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనూహ్యరీతిలో దాదాపు 36 శాతానికిపైగా పెరిగాయని అంక్టాడ్‌ తన వార్షిక నివేదికలో పేర్కొంది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్‌డిఐలు గణనీయంగా పెరిగి ఆర్థిక సంక్షోభం ముందునాటి 170 లక్షల కోట్ల డాలర్ల స్థాయికిచేరిందని, ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రారంభమైన తరువాత ఎఫ్‌డిఐలు ఈ స్థాయిలో రావటం ఇదే అత్యధికమని అంక్టాడ్‌ పెట్టుబడులు, వాణిజ్య విభాగం డైరెక్టర్‌ జేమ్స్‌ జాన్‌ వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్‌డిఐలు వెల్లువెత్తింది వాస్తవానికి ఉత్పాదక రంగంలో కాదన్నారు. వర్ధమాన దేశాలలో మొత్తంగా ఎఫ్‌డిఐలు గత ఏడాదిలో 74,100 కోట్ల డాలర్ల అత్యధిక స్థాయికి చేరుకున్నాయని, ఇది 2014 నాటి కన్నా 5 శాతం అధికమని అంక్టాడ్‌ నివేదిక వివరించింది. ప్రపంచంలో అత్యధికంగాఎఫ్‌డిఐలను ఆకర్షించింది ఆసియా మాత్రమేనని, ఈ ప్రాంతంలో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 50 వేల కోట్ల డాలర్ల స్థాయిని దాటాయని, ప్రపంచ ఎఫ్‌డిఐల ప్రవాహంలో ఇది మూడో వంతు అని ఈ నివేదిక తెలిపింది.

English summary

According to an survey made by United Nations Conference on Trade and Development says that India's Foreign Direct Investment was double in 2015 year