దుబాయ్ ‘కోట’పై తిరంగా

Indian Flag On Burj Khalifa Building In Dubai

11:15 AM ON 26th January, 2017 By Mirchi Vilas

Indian Flag On Burj Khalifa Building In Dubai

జనవరి 26 అంటే భారతీయులందరికీ ఓ పండుగ రోజు. రిపబ్లిక్ డే శుభవేళ మన జాతీయ పతాకం ఎగిరింది. మనదేశంలో సరే. ఇక దుబాయ్ ల్యాండ్ మార్క్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాపై మన మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. విదేశాల్లో ఇండియా పతాకం ఇలా కనిపించడం చాలా అరుదు అని చెప్పాలి. మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలనేకాదు దేశ త్రివిధ దళాలు, ఆయుధశక్తిని ప్రపంచానికి చాటి చెప్పే రోజు రిపబ్లిక్ డే. ప్రతీ ఏడాది గణతంత్ర దినోత్సవాన ఓ విదేశీ అధినేతను ముఖ్యఅతిథిగా పిలవడం ఆనవాయతీ. ఇప్పటికే ప్రపంచంలోని వివిధ దేశాల అగ్రనేతలు రిపబ్లిక్ రోజున మన ఆతిథ్యాన్ని స్వీకరించారు.

ఈసారి అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. యువరాజు పర్యటనకి గుర్తుగా దుబాయి బుర్జ్ ఖలీఫాపై మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. 2006 తర్వాత అరబ్ నుంచి ఓ నేత రిపబ్లిక్ డే ఉత్సవాలకు రావడం ఇదే తొలిసారి. అప్పట్లో సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా బిన్ అబ్దులాజీజ్ వచ్చిన విషయం తెల్సిందే! జయహో భారత్ ...

ఇవి కూడా చదవండి: కాఫీలో ఇది కలుపుకొని తాగితే, బరువు తగ్గుతారట

ఇవి కూడా చదవండి: ఎంత బరితెగించారు ... మహిళా ఎంపీపై లైంగిక వేధింపులు

English summary

Dubai Celebrates Indian Republic Day by glowing lights on World's Tallest Building Burj Khalifa. Dubai Prince had came to India for Republic Day Celebrations.