నగ్నంగా సైకిల్ తొక్కి రికార్డు సృష్టించిన యువతి(వీడియో)

Indian girl Meenal Jain participated in cycle rally without clothes

05:49 PM ON 31st May, 2016 By Mirchi Vilas

Indian girl Meenal Jain participated in cycle rally without clothes

అవును మీరు చూసింది నిజమే! నగ్నంగా సైకిల్ తొక్కి రికార్డు నెలకొల్పింది ఓ భారతీయ మహిళ. వివరాల్లోకి వెళితే.. ఒక భారతీయ మహిళ నగ్నంగా సైకిల్ తొక్కి ప్రపంచాన్ని తన వైపు తన వైపుకు తిప్పుకోవడమే కాకుండా, ప్రపంచ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మీనాల్ జైన్ అనే మహిళ లండన్లో ఓ ఐటీ కంపెనీ నడుపుతోంది. ఇటీవల మెల్బోర్న్లో పర్యావరణ పరిరక్షణ కోసం ఓ నగ్న ర్యాలీ నిర్వహించింది. ఇందులో ఎంతో మంది మహిళలు పాల్గొనగా.. ఇండియాకు చెందిన మీనాల్ జైన్ కూడా ఈ పోటీలో పాల్గొంది. ఒంటి మీద నూలుపోగు లేకుండా పూర్తి నగ్నంగా ఆ ర్యాలీలో సైకిల్ తొక్కింది.

ఇలా నగ్న ర్యాలీలో పాల్గొన్న తొలి భారతీయురాలిగా మీనాల్ రికార్డులకెక్కింది. అంతేకాదు.. ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఈమె నగ్నంగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడుతుందట. బీచుల్లో కూడా చాలాసార్లు పూర్తి నగ్నంగా తిరిగిందట. అంతేనా..లేడీ గోడివా కలం పేరుతో ఓ బ్లాగ్ను కూడా నడుపుతూ.. అందులో నగ్నత్వం గురించి బాగా ప్రచారం చేస్తోంది. అంతే కాదు పుట్టినప్పుడు, పోయేటప్పుడు లేని ఈ దుస్తుల గొడవ నడుమ ఎందుకు అనే సిద్ధాంతాన్ని ఈమె ఫాలో అవుతుందట. ఏదేమైనా.. ఈ అమ్మడు ఆ ర్యాలీలో పాల్గొని రికార్డ్ సాధించడం పట్ల కొందరు సంతోషంగా వుంటే.. మరికొందరు మాత్రం విమర్శలు కురిపిస్తున్నారు.

గొప్ప కట్టుబాట్లు, గొప్ప ఆచారాలు ఉన్న భారతదేశానికి చెందిన ఈ యువతి.. ఇలా నగ్నంగా నడిరోడ్డు పై తిరగడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తను దేశ పరువుని కింఛ పరుస్తుందని పలువురు చెప్తున్నారు.

English summary

Indian girl Meenal Jain participated in cycle rally without clothes