కేంద్ర తాయిలాలతో పండగేనా ?

Indian Government To Bring New Tax Policy

10:56 AM ON 20th December, 2016 By Mirchi Vilas

Indian Government To Bring  New Tax Policy

రూ 500, రూ 1000 నోట్లరద్దు నేపథ్యంలో సక్రమంగా బ్యాంకు నుంచి ఏటీఎం లనుంచి డబ్బులు రాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ప్రజల్లో సహనం కూడా పోయి , ప్రధాని మోడీని తిట్టుకుంటున్నారు కూడా. ప్రజల్లో వస్తున్న ఈ వ్యతిరేకతను తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందా? రానున్న బడ్జెట్ లో ప్రజోపయోగ తాయిలాలు ప్రకటించనుందా? అని అంటుంటే, అవుననే అధికార వర్గాలు అంటున్నాయి. ఒక్క దెబ్బకు రెండుపిట్టలు అన్నచందంగా ఇటు ప్రజలను శాంతింపజేయడంతోపాటు, నల్లధనాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనుందని సమాచారం. రానున్న బడ్జెట్ సమావేశాల్లో భారీగా పన్ను మినహాయింపులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే బడ్జెట్ లో ఈ ప్రతిపాదనలకు అవకాశముందంటున్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం.. వార్షిక ఆదాయం రూ. 4 లక్షల వరకు పన్ను ఉండకపోవచ్చని అంటుకుంటుంన్నారు.

రూ. 4 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు 10 శాతం ట్యాక్స్ ...

రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు 15 శాతం ట్యాక్స్ ...

రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు 20 శాతం ట్యాక్స్ ...

వార్షిక ఆదాయం రూ. 20 లక్షలు దాటితే 30 శాతం ట్యాక్స్ . విధించవచ్చు.

ప్రస్తుతం పరిస్థితి ప్రకారం ... రూ. 2.5 లక్షల వరకే పన్ను మినహాయింపు...

రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు 10శాతం ట్యాక్స్ ...

రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు 20 శాతం ట్యాక్స్ ...

వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు దాటితే 30 శాతం ట్యాక్స్ వుంది.

ఇవి కూడా చదవండి: వావ్ , చాక్లెట్ బిళ్ల ... ఇలా కరుగుతోందేంటి?

ఇవి కూడా చదవండి: ప్రముఖ బిలియనీర్ కూతురు కొన్న బిల్డింగ్ ఖరీదు తెలిస్తే దిమ్మ తిరుగుద్ది

English summary

People of India was still struggling for new currency notes at banks and at some point of time people were getting angry over Narendra Modi for this decision and now to cool the people Indian government was going to bring a new tax policy.