కేంద్ర బడ్జెట్ లో తీపి బానే ఉంటుందా ?

Indian Government To Introduce New Budget

11:58 AM ON 24th January, 2017 By Mirchi Vilas

Indian Government To Introduce New Budget

ఏమో, ఉండవచ్చనే సంకేతాలొస్తున్నాయి. ఎందుకంటే, పెద్ద నోట్ల రద్దుతో కొంత అసౌకర్యానికి గురై ఆగ్రహంతో ఉన్న ప్రజలకు తీపి కబురు అందించేందుకు కేంద్రం సిద్ధమైందని అంటున్నారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో సామాన్యులు ఊహించని విధంగా ఊరట కలిగించే అంశాలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ప్రత్యక్ష పన్నుల విషయంలో పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను, సెక్షన్ 80సీ పరిమితులు పెంచడంతో పాటు గృహ రుణాలను బడ్జెట్ లో మరింత చౌక చేసే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన నివేదిక ఎకోరాప్ నివేదిక పేర్కొంది.

ప్రస్తుతం ఆదాయపు పన్ను పరిమితి రూ.2.5 లక్షలుగా ఉన్న సంగతి తెలిసిందే. దీనిని ఈ బడ్జెట్ లో రూ.3లక్షలకు పెంచే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే గృహ రుణ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ. మూడు లక్షలకు పెంచనున్నారు. దీంతోపాటు సెక్షన్ 80 సీ కింద ఉన్న పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచే అవకాశం ఉంది. అలాగే పన్ను మినహాయింపు కోసం ఫిక్సిడ్ డిపాజిట్ల లాకిన్ వ్యవధిని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. చూద్దాం ఏమి జరుగుతుందో.

English summary

Indian Government to introduce new budget and people were seeing interestingly to see new budget because people of India was suffered with demonstation and to coll down them government was going to introduce new budget to satisfy the people.