ట్విట్టర్‌ హెల్ప్ కోరుతున్న కేంద్రం

Indian Government To Take Twitter Help

09:30 AM ON 24th February, 2016 By Mirchi Vilas

Indian Government To Take Twitter Help

సోషల్ మీడియా రంగంలో ఓ ప్రత్యేక స్థానం గల ట్విట్టర్‌ ని ఇప్పుడు కేంద్రం సాయం కోరుతోంది. కేంద్ర టెలికాం, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఈమేరకు దేశంలో ఉగ్రవాద వ్యాప్తిని అరికట్టేందుకు ట్విట్టర్‌ తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.. మంగళవారం ఆయన ట్విట్టర్‌ గ్లోబల్‌ పోలసీ హెడ్‌ కోలిన్‌ క్రోవెల్‌ని కలిసి ఈ విషయమై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడారు.‘సోషల్‌ మీడియా వాడకం ద్వారా భారత్‌లో ఉగ్రవాదం వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ట్విట్టర్‌, ఇతర సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్లన్నీ ఉగ్రవాదం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నేను సోషల్‌ మీడియా సైట్లను పూర్తిగా స్వాగతిస్తాను. కాకపోతే అందులో ఉగ్రవాదానికి అనుకూలంగా ఉండే పోస్ట్‌లు షేర్‌కాకుండా చూడాల్సిన బాధ్యత ఆ సంస్థలే తీసుకుంటే బాగుంటుంది. అభ్యంతరకర విషయాలున్నాయన్న కారణంగా ట్విట్టర్‌ ఇప్పటికే లక్ష ఖాతాల్ని రద్దు చేసింది’ అని ఆయన వివరించారు. ట్విట్టర్‌ కేంద్రం విజ్ఞప్తిపై ఎలా స్పందించి నిర్ణయం తీసుకుంటుందో మరి.

English summary

Indian Telecommunications and Information Technology Ravi Shankar Prasad requested Twitter to support Terrorism in India.Minister says that every social networking site have to focus on the illegal activities on their site.