హమ్మయ్యా మనోళ్ళు గెలిచారు!!

Indian Hockey Team Wons Bronze Medal

01:19 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Indian Hockey Team Wons Bronze Medal

భారత హాకీ టీం తన మొట్టమొదటి పతకాన్ని సొంతం చేసుకుంది. ఇంటర్‌నేషనల్‌ హాకీ ఫెడరేషన్‌ (ఎఫ్‌ఐహెచ్‌) టోర్నయెంట్‌ భారత పతకం గెలవడం గత 33ఏళ్ళలో ఇదే ప్రధమం.

ఈ టోర్నమెంట్‌లో భారత హాకీ జట్టు నెదర్లాండ్స్‌ హాకీ జట్టు పై విజయం సాధించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇంతకు ముందు జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో బెల్జియం చేతిలో ఓటమి చెందిన భారత్‌, మూడో స్థానం కోసం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5-5 స్కోరుతో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌ ఫలితాన్ని పెనాల్టి షూటౌట్‌ ద్వారా భారత్‌ 3-2 తేడాతో నెదర్లాండ్స్‌ పై నెగ్గి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ విజయం తమలో స్పూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని జట్టు సభ్యులు పేర్కొంటున్నారు.

2016 లో జరగబోయే ఒలంపిక్స్‌ ముందు భారత హాకీ జట్టు పతకం గెలవడం ఆనందించదగ్గ విషయం. ఈ స్పూర్తితోనే ఒలంపిక్స్‌లో కూడా ఆడి పతకం గెలిచి ఇండియాలో హాకీ కి పూర్వవైభవం తేవాలని కోరుకుందాం.

English summary

Indian Hockey Team wons Bronze medal by beating netherlands in penality shoot out.Indian Hockey team wons medal for the first time in International Hockey Federation (FIH) tournament in 33 years