అమెరికాకు హిందూ అధ్యక్షుడా... ఒబామా షాకింగ్ కామెంట్స్

Indian leader for America...Obama shocking comments

11:35 AM ON 20th January, 2017 By Mirchi Vilas

Indian leader for America...Obama shocking comments

అందరికీ అవకాశాల విధానాన్ని కొనసాగిస్తే ఏనాటికైనా అమెరికాకు ఒక హిందువు అధ్యక్షుడు అవుతాడా? అంటే అవుననే అంటున్నారు అధ్యక్షుడిగా చివరి విలేకరుల సమావేశంలో పాల్గొన్న బరాక్ ఒబామా చెప్పుకొచ్చారు. శుక్రవారం ట్రంప్ కు బాధ్యతలు అప్పగిస్తున్న ఒ బామా శేష జీవితాన్ని రచయితగా గడపాలని భావిస్తున్నారు. ప్రశాంతమైన జీవితం గడుపుతానని, ఎక్కువ సమయం ఇద్దరు కుమార్తెలతో గడపాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అయితే, ప్రజా జీవితాన్ని వదిలి వెళ్లబోనని, ఎన్నికల జోలికి వెళ్లనని స్పష్టం చేశారు. అమెరికాలో జాతి వైవిధ్యాన్ని కాపాడితే ఒక మహిళ, ఒక హిందువు, ఒక యూదు, ఒక లాటినో అధ్యక్షులు తప్పకుండా అధ్యక్షులవుతారని చెప్పారు. మరోసారి నల్లజాతి అధ్యక్షుడు వచ్చే అవకాశాల గురించి ప్రశ్నించగా ఒబామా పైవిధంగా స్పందించారు. 2008లో ఎన్నికైనపుడు ఒబామా తొలి నల్లజాతి అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు. భవిష్యత్తులో జాతులతో సంబంధం లేకుండా ప్రతిభావంతులే ఉన్నత స్థానాల్లోకి వస్తారని ఒబామా విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థలో ప్రతీ ఒక్కరికీ పాత్ర కల్పించాలని పిలుపునిచ్చారు. తమను జాతి మరచిపోయిందని భావించిన వాళ్లే ట్రంప్ కు ఓటేసి గెలిపించారని, ఇప్పుడు వారిని ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి తీసుకొచ్చే బాధ్యత ట్రంప్ దేనని చెప్పారు. మీడియా చుట్టూ ఉం డటం వల్లే శ్వేతసౌధం నిజాయితీ గా ఉందన్నారు. వైట్ హౌ్ సలో మీడియాకు చోటు లేకుండా చేయాలన్న ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టారు.

ట్రంప్ పాలనలో ఏదో జరుగుతుందని భయపడనక్కరలేదని, అంతా బాగానే ఉంటుందని ఒబామా భరోసా ఇచ్చారు. అయితే, జాతి వివక్ష, మీడియా స్వేచ్ఛను హరించడం, యువ వలసదారులను ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మౌలిక విలువలపై రాజీపడే పని లేదన్నారు. వీటి గురించి ట్రంప్ కు చెప్పాల్సినంత చెప్పానన్నారు. పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య యథాతథ స్థితి ఎంతోకాలం కొనసాగదని చెప్పారు. అక్కడ తలెత్తే పరిస్థితి అమెరికా భద్రతకు కూడా ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఇది కూడా చూడండి: బ్రహ్మంగారి కాలజ్ఞానం లో ఇప్పటివరకు ఎన్ని నిజమయ్యాయో మీరే చూడండి

ఇది కూడా చూడండి: ఆ సమయాల్లో తులసి ఆకులు తెంపితే ఏమౌతుందో తెలుసా

English summary

Donald Trump is going to take his responsibilities today. And Obama said that he want to spend his rest of the life with his family and two daughters.