పాకిస్తాన్‌పై బెట్ కట్టి ప్రాణాలు తీసుకున్నాడు

Indian man suicides for Pakistan lost match against Bangladesh

02:39 PM ON 10th March, 2016 By Mirchi Vilas

Indian man suicides for Pakistan lost match against Bangladesh

ఇటీవలే ఆసియా కప్‌ సిరీస్‌ మొదటిసారి టీ20 లో జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భారత్‌ ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా ఘనంగా ఆసియా కప్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే సెమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ పై పాకిస్తాన్‌ ఓడిపోవడంతో పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు విషయంలోకి వస్తే ఆసియా కప్‌ సెమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌తో తలపడే పాకిస్తాన్‌ గెలుస్తుందని పంజాబ్‌కి చెందిన మొహ్మద్‌ షఫిక్‌ పందెం వేశాడు. ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ క్లర్క్‌గా పని చేస్తున్న మొహ్మద్‌ తన నెల జీతం 30,000 రూపాయలతో ఎలాగో పాకిస్తానే గెలుస్తుందని తన జీతం మొత్తం పందెం వేశాడు.

అయితే అనూహ్యంగా బంగ్లాదేశ్‌ చేతిలో పాకిస్తాన్‌ ఓడిపోవడంతో ఆ విషయాన్ని జీర్ణించుకోలేని అతడు తన ఇంట్లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పాకిస్తాన్‌ అభిమాని అయిన ఇతడు చిన్న దేశం అయిన బంగ్లాదేశ్‌ పై ఓడిపోవడంతో పాటు తన నెల జీతం మొత్తం పోగొట్టుకున్నందువల్లే మొహ్మద్‌ షఫిక్‌ ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లిదండ్రులు తెలిపారు. దీని పై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి పోస్ట్‌మార్టం విధించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

English summary

Indian man suicides for Pakistan lost match against Bangladesh in Asia Cup semi-final. He is the fan of Pakistan team.