మొబైల్ యూజర్స్ @100 కోట్లు

Indian Mobile Subscriber Base Breaches One Billion

12:35 PM ON 1st January, 2016 By Mirchi Vilas

Indian Mobile Subscriber Base Breaches One Billion

భారతదేశ జనాభా 120 కోట్లు.. కానీ దేశంలో మొబైల్ వినియోగదారుల సంఖ్య మాత్రం 100 కోట్లు దాటేసింది. ఈ విషయాన్ని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడించింది. టెలికాం ఆపరేటర్ల మధ్య తీవ్ర పోటీ ఉండడంతో ప్రజలకు తక్కువ ధరలకే కమ్యూనికేషన్ సేవలను అందిస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే మొబైల్ సబ్‌స్రైబర్ల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతూ వస్తుందని పేర్కొంది. మొబైల్ వినియోగదారుల సంఖ్యలో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో కొనసాగుతోందని వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్‌లోనే దాదాపు 70 లక్షల మంది కొత్తగా మొబైల్ కనెక్షన్లను తీసుకున్నారని దీంతో భారత్ 100 కోట్ల మార్క్‌ను దాటిందని తెలిపింది. చైనా 2012లోనే 100 మార్క్‌ను దాటగా భారత్ ఇప్పుడు ఆ లక్ష్యాన్ని ఛేదించింది.

English summary

Indian Mobile Subscriber Base Breaches One Billion