భారత సంతతి వైద్యునికి 30 ఏళ్ల జైలు

Indian-Origin Doctor Gets 30 Years Jail

04:26 PM ON 17th December, 2015 By Mirchi Vilas

 Indian-Origin Doctor Gets 30 Years Jail

బాలికకు మత్తుమందు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డ భారత సంతతికి చెందిన వైద్యుడికి అమెరికా కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. భారత సంతతికి చెందిన వైద్యుడు రాకేష్ పన్ను(57)చిన్న పిల్లల వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి వద్దకు చికిత్స కోసం వచ్చే చిన్నారులు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని మాయ మాటలు చెప్పి.. వారి తల్లిదండ్రులను బయటే ఉంచి.. గదిలో బాలికలకు మత్తు మందు ఇచ్చి.. లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఆపై ఆ దృశ్యాలను ఫొటో తీసేవాడు. ఆ విషయాన్ని ఓ బాలిక తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో 2010లో రాకేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అందులోభాగంగా రాకేష్ నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో కోర్టు అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

English summary

An Indian -Origin doctor nameed Rakesh pannu aged 57 has jailed for 30 years in america for sexual harrasment