రైల్వేశాఖకి అంబాసిడర్‌గా ఎన్టీఆర్‌ 

Indian Railways Endorses Ntr's Dialogue

03:29 PM ON 17th February, 2016 By Mirchi Vilas

Indian Railways Endorses Ntr's Dialogue

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన సూపర్‌ మూవీ 'రాఖీ'. ఇందులో విలన్‌గా నటించిన షాయాజీ షిండే రైల్వేస్టేషన్‌లో ఎన్టీఆర్‌ తో ఆఫ్టరాల్‌ ఇండియన్‌ రైల్వేస్‌ అంటూ కించ పరుస్తాడు. దీనితో ఆగ్రహం చెందిన ఎన్టీఆర్‌ షాయాజీ షిండే కి ఇండియన్‌ రైల్వేశాఖ యొక్క గొప్పతనాన్ని వివరిస్తాడు. ఇప్పుడు ఆ డైలాగ్‌ని సేలం రైల్వేశాఖ లో ఒక రైల్వే అధికారి షేర్‌ చేశాడు. ఆ డైలాగ్‌ నచ్చడంతో రైల్వేశాఖ ఇప్పుడు తమ ప్రచారం కోసం ఈ డైలాగ్‌ ని వాడుకుంటుంది. అంతేకాదు ఆ వీడియోని ప్రతీ రైల్వేస్టేషన్‌ లోనూ టీవీలలో దీన్ని ప్రచారిస్తున్నారట. తమ శాఖను ప్రమోట్‌ చేసుకోవడానికి ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌ ని ఈ రకంగా వాడుకుంటున్నారు. ఐడియా బాగానే ఉంది కానీ మరీ ఇన్నేళ్లు తర్వాతా ? ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్‌' చిత్రంలో నటిస్తున్నాడు.

English summary

Presently NTR was acting in his next film Janata Garrage under the direction of Koratala Shiva.NTR's past movie Rakhi was super hit at the box office and there is one good dialogue about Railways.Now Indian Railway was decided to Indian Railways Endorses Ntr's Dialogue in all Railway Stations