ఐదేళ్లలో రైల్వే రెవెన్యూ 50% అప్

Indian Railways Income To Increased By 50 percent in 5 Years

11:09 AM ON 6th February, 2016 By Mirchi Vilas

Indian Railways Income To Increased By 50 percent in 5 Years

వచ్చే ఐదేళ్లలో ఇండియన్ రైల్వే ఆదాయం 50 శాతం పెరగనుందట. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభు తెలిపారు. ఇండియా ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌-2016లో పాల్గొన్న ఆయన.. ప్రపంచ దేశాల్లో ఆర్థికవృద్ధి మందగమనంతో పయనిస్తున్న తరుణంలో అధిక వృద్ధిరేటు సాధిస్తున్న దేశం భారత్‌ మాత్రమే అన్నారు. భారత రైల్వేల్లో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు. రైల్వే అసలైన గమ్య స్థానమని, కచ్చితమైన ఆదాయం లభిస్తుందని, రైల్వేశాఖ ప్రభుత్వ అధీనంలో నడుస్తోంది కాబట్టి పెట్టుబడి సురక్షితంగా ఉంటుందని సురేశ్‌ప్రభు అన్నారు. రానున్న ఐదేళ్లలో రైల్వేశాఖ ఆదాయం 50 శాతం పెరుగుతుందని తెలిపారు. 2014-15లో 1,57,880 కోట్ల రాబడి వస్తే అంతకు ముందు ఏడాది ఇది 1,40,761 కోట్లు వచ్చిందని.. అంటే 12.6 శాతం పెరిగిందని వెల్లడించారు.

English summary

Indian Railway Minister Suresh Prabhu Says That Indian Railways income to Increased By 50 percent in 5 Years.The Railways, the Minister said, is trying to create a fund, with the World Bank as anchor and pension and sovereign wealth funds as co-investors.