రైల్వే ఎంప్లాయిస్ డ్రెస్ కోడ్ చేంజ్

Indian Railways staff dress code want to change by government

04:06 PM ON 27th July, 2016 By Mirchi Vilas

Indian Railways staff dress code want to change by government

ఇండియన్ రైల్వేస్ లో పని చేసే ఉద్యోగుల డ్రెస్ కోడ్ చేంజ్ అయింది. నేవీ బ్లూ రంగులో వుండే ముతక షర్ట్, ప్యాంట్.. లైట్ నీలంరంగు చొక్కా లేదంటే తెల్ల ప్యాంట్, తెల్ల చొక్కాతో కూడిన డ్రెస్ ఓల్డ్ కావడంతో ఉద్యోగుల కోసం కొత్త డ్రెస్ తేవాలని ఇండియన్ రైల్వేస్ నిర్ణయించింది. ఇందుకోసం రైల్వే అధికారులు ఢిల్లీకి చెందిన ప్రముఖ డ్రెస్ డిజైనర్ రితూ బేరీని సంప్రదించారట. దీంతో రీతూ.. బేరి ఖాదీ క్లాత్, కొన్ని ఇతర రకాల క్లాత్ లతో మన వాతావరణానికి సరిపడే విధంగా కొన్నిరకాల సరికొత్త డిజైన్లు రూపొందించి రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు, రైల్వే బోర్డు మెంబర్లకు చూపించిందట.

భారత సాంప్రదాయక విలువలు, ప్రతిబింబించేలా ఆంధ్రప్రదేశ్ నుంచి కలంకారీ, బీహార్ నుంచి మధుబనీ, మధ్యప్రదేశ్ కు చెందిన వార్లీ ఆర్ట్, హరప్పా కాలం నాటి స్థూపాలు, కోనార్క్ టెంపుల్, నవాబుల కాలంనాటి సంస్కృతి ప్రతిబింబించేలా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. బోర్డ్ తో పాటు పబ్లిక్ అభిప్రాయం కూడా తీసుకుని ఈ డిజైన్లలో ఒకటి సెలెక్ట్ చేస్తారట. స్టేషన్ మాస్టర్లు, లోకో పైలైట్లు, ట్రైన్ టిక్కెట్ ఎగ్జామినర్లు, గార్డులతో సహా అందరూ కొత్తకొత్తగా మెరుస్తారన్న మాట.

1/7 Pages

English summary

Indian Railways staff dress code want to change by government