ఒలంపిక్స్‌ కు భారత రిఫరీ

Indian Referee Ashok Kumar Selects For RIO Olympics

01:54 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Indian Referee Ashok Kumar Selects For RIO Olympics

2016 లో బ్రెజిల్‌ వేదికగా జరుగనున్న రియో ఒలంపిక్స్‌లో భారత్‌ కు చెందిన అశోక్‌కుమార్‌ రిఫరీగా ఎంపికయ్యారు. దీంతో ఒలంపిక్స్‌కు ఎంపికైన తొలి భారతీయ రిఫరీగా అశోక్‌కుమార్‌ రికార్డు సృష్టించాడు. అశోక్‌కుమార్‌ రెజ్లింగ్‌ విభాగంలో రిఫరీగా ఎంపికయ్యాడు.

ఈ విభాగంలో భాగంగా మొత్తం 50 మందిని యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ ( UWR ) వారు ఎంపిక చెయ్యగా వారిలో ఆశోక్‌కుమార్‌ కూడా స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం అశోక్‌కుమార్‌ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ లో వారెంట్‌ ఆఫీసర్‌ గా విధులు నిర్వహిస్తున్నారు. ఒక భారతీయ రిఫరీ ఒలంపిక్స్‌కు ఎంపిక కావడం నిజంగా దేశం గర్వించదగ్గ విషయం.

English summary

Indian Referee Ashok Kumar Selects For RIO Olympics. He is the first person who have selected for Olympics referee.