భారతదేశ శాస్త్రవేత్తలు

Indian Scientists and their Inventions

03:16 PM ON 17th February, 2016 By Mirchi Vilas

Indian Scientists and their Inventions

జగదీష్ చంద్ర బోస్ నుండి దబ్బాల రాజగోపాల్ వరకు ఎందరో గొప్పగొప్ప శాస్త్రవేత్తలు భారతదేశంలో ఎన్నో విభాగాలలో తమ ప్రతిభను కనపరిచారు. భౌతిక శాస్త్రం, వైద్యశాస్త్రం, గణితశాస్త్రం, రసాయనశాస్త్రం మరియు జీవశాస్త్రం తో ఎన్నో పరిశోధనలు చేసి భారతదేశానికి మంచి గుర్తింపు తీసుకువచ్చారు. మన భారతీయ శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఆధునిక శాస్త్రీయ పరిశోధనలకు మార్గదర్శకంగా నిలిచాయి. భారతదేశ చరిత్రలో చెప్పుకోదగ్గ మహనీయులు ఎందరో ఉన్నారు. ఆ మహనీయులు ఎవరో వారి ఆవిష్కరణలు ఏమిటో ఒకసారి గుర్తుచేసుకుందాం.

1/15 Pages

జగదీష్ చంద్ర బోస్

జగదీష్ చంద్ర బోస్ నవంబర్ 30, 1858 న జన్మించారు. బెంగాల్ కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. ఇతడు రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో పాటు  వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు. ఇతడు  రేడియో సైన్స్  పితామహుడు. భారతదేశం నుండి 1904 సంవత్సరంలో అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి వ్యక్తి జగదీష్ చంద్ర బోస్. జగదీష్ వంబర్ 23, 1937 న మరణించారు.

English summary

In this article will discuss the famous Indian scientists and inventors throughout history.Some of them have also contributed in a substantial way to advanced scientific research in many different regions.