వరల్డ్ కప్ కు 5న టీమిండియా ప్రకటన

Indian team for World T20 to be selected on February 5

09:25 AM ON 4th February, 2016 By Mirchi Vilas

Indian team for World T20 to be selected on February 5

త్వరలో జరగనున్న ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌లకు భారత క్రికెట్ జట్టును ఫిబ్రవరి 5న ఎంపిక చేయన్నారు. చీఫ్‌ సెలక్టర్‌ సందీప్‌ పాటిల్‌ అధ్యక్షతన ఢిల్లీలో శుక్రవారం సమావేశం కానున్న సెలక్షన్‌ కమిటీ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఆసియా కప్‌లో భారత్‌ తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 24న ఆతిథ్య బంగ్లాదేశ్‌తో ఆడనుంది. అనంతరం టోర్నీలోనే ఆసక్తికరమైన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ 27న జరగనుండగా.. మార్చి 1న శ్రీలంకతో టీమిండియా ఢీకొనబోతోంది. తొలిసారి వన్డే నుంచి టీ20 ఫార్మాట్‌లోకి మారిన ఆసియాకప్‌ మార్చి 6న ఫైనల్‌తో ముగుస్తుంది. తర్వాత భారత్‌ వేదికగా మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 3 వరకు టీ20 ప్రపంచకప్‌ జరగనుంది.

English summary

Indian Cricket Team for upcomingT20 World Cup and Asia Cup was selected to be on February 5th by BCCI. In this year Asia Cup also to be held in T20 Format