ఆసీస్ పై టీ20 సిరీస్‌ గెలిచిన భారత మహిళా టీమ్

Indian Woman Cricket Team Wons T20 Series Against Australia

11:11 AM ON 30th January, 2016 By Mirchi Vilas

Indian Woman Cricket Team Wons T20 Series Against Australia

ఫురుషుల జట్టే కాదు.. మహిళా జట్టు కూడా ఆస్ట్రేలియాపై సత్తా చాటింది. టీ20 సిరీస్‌ను భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టీ20లో భారత్‌ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో భారత మహిళల జట్టు గెలుపొందింది. ఆసీస్‌పై భారత మహిళా జట్టు టీ20 సిరీస్‌ నెగ్గడం ఇదే తొలిసారి. తొలుత టాస్‌ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 18 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. మరోసారి వర్షం ఆటంకం కలిగించడంతో భారత్‌ 10ఓవర్లలో 66 పరుగులు చేయాల్సి వచ్చింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన మిథాలి రాజ్‌ 37 పరుగులతో, మంథన 22 పరుగులతో అజేయంగా నిలిచి 9.1ఓవర్లలో లక్ష్యాన్ని ఛేధించారు. జులన్‌ గోస్వామి 4 ఓవర్లలో 2 వికెట్లు తీసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ని భారత్‌ 2-0తో కైవసం చేసుకుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును జులన్‌ గోస్వామి అందుకుంది.

English summary

India Woman cricket team Won T20 series against Australia in Australia for the first time in Cricket History.On the other hand Indian Mens Crircket team was also won two matches in three match series and win the Series Against Australia