డేటింగ్‌ యాప్‌‌‌‌ల వాడకంలో మహిళలదే హవా

Indian Women Were More Active Than Men On Dating Sites

11:35 AM ON 27th November, 2015 By Mirchi Vilas

Indian Women Were More Active Than Men On Dating Sites

డేటింగ్‌...పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ పదం ఇప్పుడు దేశంలోనూ వేళ్ళూనుకుంటుంది. సంప్రదాయిక దేశంగా కనిపించే ఇండియాలో ఇప్పుడు ఈ కల్చర్‌ జోరందుకుంటుంది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో, సోషల్‌ మీడియా ప్రభావంతో యువత ఇప్పుడు డేటింగ్‌ బాట పడుతున్నారు. గడిచిన ఏడాదితో పోల్చితే డేటింగ్‌ కల్చర్‌ ఇండియాలో 400 శాతం పెరిగిందట. ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌ అయిన టిండర్‌ యాప్‌ చేసిన ఒక సర్వేలో తేలిందేమిటంటే గడిచిన ఏడాదితో పోల్చితే ఈ ఏడాది తమ డేటింగ్‌ యాప్‌ను ఉపయోగించుకునే వారి సంఖ్య 400శాతం గణణీయంగా పెరిగిందట. అత్యంత ప్రజాదరణ చూరగొంటున్న టిండర్‌ డేటింగ్‌ యాప్‌ ఉపయోగించుకునే వారిలో మగవారి కంటే మహిళలే ఎక్కువగా ఉండడం విశేషం. వారానికి పదిలక్షలకు పైగా యాప్‌ వినియోగదారులు లైక్‌లు కొడుతున్నారట. అందులో కూడా మహిళల వాటానే అధికమని కంపెనీ ప్రకటించింది.

దేశంలోని అత్యధిక శాతం మంది 35 సంవత్సరాలలోపు వారే. వీళ్ళంతా మొబైల్‌, ఇంటర్నెట్‌ టెక్నాలజీ మీద మంచి పట్టు ఉన్న వారే కావడంతో టిండర్‌ లాంటి డేటింగ్‌ యాప్‌ల హవా కొనసాగుతోంది. పెరుగుతున్న పాశ్చాత్య పోకడలు కూడా డేటింగ్‌ యాప్‌ల పెరుగుదలకు ఒక కారణం.

టిండర్‌లాగే ట్రూలీ మాడ్‌లీ, ఒకే క్యూపిడ్‌, వూ వంటి డేటింగ్‌ యాప్‌లు ఇండియాను ముంచెత్తుతున్నాయి. రోజుకు కోట్ల మంది యువతీయువకులు ఈ డేటింగ్‌ యాప్‌లతో తమ భాగస్వామిని ఎన్నుకుంటున్నారు.


English summary

Famous Online dating app Tinder said it noticed that a 400 per cent increase in downloads in the country in the last year, and women are more active in using the application than men.