స్పిన్ ఉచ్చులో.. లంక విలవిల..

Indian Won T20 Series Against Srilanka

10:39 AM ON 15th February, 2016 By Mirchi Vilas

Indian Won T20 Series Against Srilanka

టీమిండియా స్పిన్నర్ల ఉచ్చులో చిక్కి శ్రీలంక క్రికెటర్లు విలవిలలాడారు. కీలకమైన మూడో టీ20లో కేవలం 82 పరుగులకే కుప్పకూలి మ్యాచ్ ను.. సిరీస్ ను కూడా భారత జట్టుకు అప్పగించేశారు. స్పిన్‌కు అనుకూలించిన విశాఖపట్నం పిచ్ పై శ్రీలంక బ్యాట్స్ మెన్ అసలు పోటీ ఇవ్వలేకపోయారు. టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ ధోనీ లంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలి ఓవర్‌లోనే అశ్విన్‌తో బౌలింగ్‌ చేయించాడు. ఈ ఎత్తుగడ ఫలితాన్నిచ్చింది. తొలి ఓవర్లోనే అశ్విన్ ధోని రెండు వికెట్లు పడగొట్టి లంకకు షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్‌ రెండో బంతికే లంక ఓపెనర్‌ డిక్వెల్లా (1) స్టంపౌట్‌గా వెనుదిరగగా.. అదే ఓవర్‌ చివరి బంతికి మరో ఓపెనర్‌ దిల్షాన్‌(1) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఈ షాక్ నుంచి కోలుకోని శ్రీలంక బ్యాట్స్ మన్ వరుసగా వికెట్లు ఇచ్చేశారు. భారత బౌలర్ల జోరుతో 9 మంది బ్యాట్స్‌మెన్లు రెండంకెల స్కోరు కూడా చేయలేదు. శనక (19), పెరీరా (12) టాప్ స్కోరర్లు. దీంతో శ్రీలంక 18 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బౌలర్లలో అశ్విన్‌ 4, రైనా 2, జడేజా, బుమ్రా, నెహ్రా తలో వికెట్‌ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(13) తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరినా.. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (46) రహానె(22)తో కలిసి

మ్యాచ్ ను ముగించాడు. దీంతో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 13.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1తో కైవసం చేసుకుంది.

English summary

Team India won T20 series against Srilanka.India won the third T20 match against Srilanka which was held in Vishakapatnam.Srilanks bowled out for 82/10 in 18 overs and India chased down the target in 84/1 in just 13.5 overs.