ఒలంపిక్స్ లో భారత్ ఖాతా తెరిచింది

Indian wrestler Sakhi Malik won bronz medal in rio olympics

11:44 AM ON 18th August, 2016 By Mirchi Vilas

Indian wrestler Sakhi Malik won bronz medal in rio olympics

మొత్తానికి రియో ఒలంపిక్స్ లో భారత్ తొలి బోణీ కొట్టింది. దీంతో పతకాల ఖాతా తెరిచినట్టయింది. మహిళల ప్రీ-స్టయిల్ రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సాధించి, భారత ఆశలను నిలబెట్టింది. 8-5 లో కిర్గిజిస్తాన్ కు చెందిన ఐసులు టినిబెనోవా పై గెలిచింది. అంతకుముందే రెప్ బెజ్ బౌట్ లో ఈమె 12-3 తో మంగోలియా రెజ్లర్ ఒర్ఖాన్ పై నెగ్గడం విశేషం. తొలి రౌండ్ లో ఓటమి అంచులకు చేరి చివరి 10 సెకన్లలో గెలుపు సాధించిన సాక్షి.. ప్రీ-క్వార్టర్స్ లోను అసాధారణంగా పోరాడింది. ఆ తర్వాత క్వార్టర్స్ లో ఓడినా క్వార్టర్ ఫైనల్ కు చేరడంతో రెపిచెజ్ కు అర్హత పొందిన సాక్షి వరుసగా నెగ్గి సత్తా చాటింది. మరిన్ని పతకాలు భారత్ ఖాతాలో చేరాలని పలువురు క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

English summary

Indian wrestler Sakhi Malik won bronz medal in rio olympics