అమెరికాలో హడలెత్తిస్తున్న ఈ తెలుగమ్మాయి కామెంట్స్ (వీడియో)

Indian Young Girl From US Makes Sensational Comments Video

10:52 AM ON 20th January, 2017 By Mirchi Vilas

Indian Young Girl From US Makes Sensational Comments Video

గత నవంబర్ లో అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో అమెరికాలోని ప్రవాసులు తీవ్ర ఆందోళనలకు గురి అవుతున్నారు. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన నాటి నుంచి ఇదే పరిస్థితి. ఎన్నికల వేళ ఇష్టారాజ్యంగా మాట్లాడిన ట్రంప్.. ఎన్నికల తర్వాత అయినా మార్పు వస్తుందని పలువురు భావించారు. కానీ.. అలాంటిదేమీ లేదన్న విషయాన్ని తన మాటలు.. చేతలతో తేల్చేశారు.

దీంతో.. ట్రంప్ కానీ అమెరికా అధ్యక్షుడి కుర్చీలో కూర్చున్న నాటి నుంచి ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. వేరే దేశాల నుంచి వచ్చే వారి విషయంలో కత్తి కట్టే ట్రంప్.. ఇతర దేశస్తుల విషయంలో కఠినంగా ఉంటారన్న భయాందోళనలు నెలకొన్నాయి. అమెరికాలో ఉద్యోగాలు చేసే విదేశీయుల నుంచి విద్యార్థుల వరకూ అందరూ విపరీతమైన టెన్షన్ పడుతున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే.. స్థానికులకు ప్రాధాన్యత ఇస్తే తమ పరిస్థితి ఏమిటన్నది వీరి భయాందోళన.

ఇదిలా ఉంటే.. ప్రవాస భారతీయులు.. మరి ముఖ్యంగా తెలుగువారు ఎలాంటి మైండ్ సెట్ లో ఉన్నారు? వారెలా ఫీలవుతున్నారు? లాంటి అంశాలతో పాటు.. అమెరికాలో ఏం జరుగుతుందో తెలుసా? అంటూ ఒక తెలుగమ్మాయి పెట్టిన వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ గా మారింది. ఆమె మాటలు ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. నిజానికి ఆమె చెప్పిన మాటల్లో నిజాల సంగతి ఏమో కానీ.. ఆమ మాటలు ఇప్పుడు యూట్యూబ్ సంచలనం అయింది. ఆమె ఏముందో మీరూ వినండి

English summary

Indian Young Girl From US Makes Sensational Comments Video.