హవ్వ! ఇది కూడా తెలీదట.. అసలు మనం ఎక్కడికి పోతున్నట్టు(వీడియో)

Indians On Surgical Strike On Pakistan

04:43 PM ON 31st October, 2016 By Mirchi Vilas

Indians On Surgical Strike On Pakistan

దేశం కోసం సర్వస్వము త్యాగం చేసిన స్వాతంత్ర్య వీరుల గురించి తెలీదు.. చారిత్రిక నేపధ్యాలు తెలియవు.. చివరకు సర్జికల్ స్ట్రైక్స్ గురించి కూడా తెలీని యువత వున్నారంటే ఏమనాలి. దేశ సైనికులు అత్యంత సాహసంతో చేసిన లక్ష్యిత దాడులే సర్జికల్ స్ట్రైక్స్ అని ప్రపంచం అంతా తెలిసిపోయింది. ఉరి ఘటనకు మన సైనికులు సర్జికల్ స్ట్రైక్స్ తో దీటుగా బదులిచ్చారు. ఈ అంశం అనేక అవకాశవాద రాజకీయాలకు వేదికగా కూడా మారింది. అయితే ఇంత జరుగుతున్నా సర్జికల్ స్ట్రైక్స్ అనే పదానికి అర్థం తెలియని వారున్నారంటే నమ్ముతారా? అవును మరి నమ్మి తీరాలి. ఎందుకంటే మన దేశానికి చెందిన కొందరు యువత అంత గొప్పగా కరెంట్ ఎఫైర్స్ ను ఫాలో అవుతున్నారు మరి.

ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. నిరక్షరాస్యులయితే ఏమోలే అనుకోవచ్చు కానీ విద్యావంతులు, ఉద్యోగులకు కూడా తెలియదంటే ఇంకేమనాలి. సైనికులు మన కోసం అత్యంత ధైర్య సాహసాలతో చేసిన ఈ సర్జికల్ దాడుల గురించి తెలియని వారు ఎంత మంది ఉన్నారో ఈ వీడియో పై ఓ లుక్కెయ్యండి మీకే తెలుస్తుంది.

English summary

Indians On Surgical Strike On Pakistan