ఆ సైబర్ ఎక్స్పర్ట్ వయస్సు తొమ్మిదేళ్ళు

India's 9 years old boy Paul Reuben became CEO

07:49 PM ON 7th November, 2015 By Mirchi Vilas

 India's 9 years old boy Paul Reuben became CEO

తొమ్మిది సంవత్సరాల వయస్సు పిల్లలు ఆటపాటలతో తుల్లుతు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి స్కూల్ ఇంకా ఇల్లు ఇదే ప్రపంచం. చక్కగా స్కూల్ నుండి రాగానే సాయంకాలం అంతా ఆడుకుని హ్యాపీ గా పడుకుంటారు. పిల్లలు అంటే మనకు ఇదే తెలుసు కానీ నేను అలా కాదు అంటున్నాడు ర్యూబెన్ పాల్ అనే తొమ్మిదిఏళ్ల బాలుడు. ఈ చిచ్చర పిడుగు ఇప్పుడు సైబర్ ఎక్స్పర్ట్.

ఆశ్చర్యం కలించే విషయాలు ఏమిటంటే ఈ పిల్లవాడు ఒక గేమ్ అబివృద్ది సంస్థ కి సీఈఒ. ఇంత చిన్న వయస్సు లో ఒక సంస్థ సీఈఒ అంటే ఆశ్చర్యమే కదా... అంతేకాదు ఈ చిచ్చర పిడుగు లో ఇంకా చాలా ట్యాలెంట్స్ ఉన్నాయి హ్యాకర్ నిపుణుడు, అప్ డెవెలపర్ ఇంకా సైబర్ నిపుణుడు. 2015 లో జరిగిన గ్రౌండ్ జీరో సమావేశం లో ప్రత్యేక రాయబారి ర్యూబెన్ పాల్. అతిపెద్ద సైబర్ సెక్యూరిటీ సమావేశాలలో ఒకటైన దీంట్లో సైబర్ నిపుణులు, పరిశొదకులతొపాటు ఈ బాల మేధావి పాల్గొన్నాడు. పాల్ ఒక మంచి సైబర్ స్పై కావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

English summary

India's 9 years old boy Paul Reuben became CEO. Reuben Paul is an accomplished hacker.