ఇండో- అమెరికా మహిళ ను కాల్చేసారు

Indo American Woman Murdered In California

01:39 PM ON 30th May, 2016 By Mirchi Vilas

Indo American Woman Murdered In California

మర్డర్లు అక్కడా ఇక్కడా అనే తేడా లేదు ఏ దేశం లోనైనా ఒకేలా వుంది. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇండో-అమెరికన్ మహిళ దారుణహత్యకు గురైంది. శాన్‌జోన్‌లోని నివాసముంటున్న 48 ఏళ్ల సోనియా నల్లాన్ను ఆమె భర్త జేమ్స్ నల్లన్ కాల్చి చంపేశాడు. ఈ ఘటన నాలుగు రోజుల కిందట జరిగినట్లు తెలుస్తుంది. మృతురాలు సోనియా నల్లాన్ ఎంకోర్ సెమీ కండక్టర్స్ అనే కంపెనీలో జాబ్ చేస్తోంది. 63 ఏళ్ల ఆమె భర్త జేమ్స్ నల్లన్ కూడా ఇండో అమెరికన్నే. వీళ్లకి ఇద్దరు కుమారులున్నారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సివుంది.

సోనియా నల్లాన్- జేమ్స్లది లవ్ మ్యారేజ్. ఐతే, ఏడేళ్ల కిందట తన ఇంటికి మరమ్మత్తులు చేస్తుండగా జేమ్స్కు తగిలిన దెబ్బలతో మూడునెలలు కోమాలోకి వెళ్లిపోయాడు. కోమా నుంచి బయటపడిన తర్వాత జేమ్స్లో చాలా మార్పులు వచ్చాయని ఆయన సోదరుడు చెబుతున్నాడు. భర్త హెల్త్ విషయంలో సోనియా కూడా ఎంతో కేర్ తీసుకునేదని ఇంతలోనే ఇలా జరగడం ఆశ్చర్యంగా వుందని అంటున్నాడు. మరి పోలీసుల దర్యాప్తులో ఏమి వెల్లడి కానుందో మరి.

ఇవి కూడా చదవండి:టాయ్‌లెట్‌కు వెళ్తే, పురుషాంగం పై కాటేసిన పైథాన్

ఇవి కూడా చదవండి:డేర్ ఉంటే నైట్ టైం ఈ హర్రర్ మూవీస్ ఒంటరిగా చూడండి

English summary

Indo Americam Woman was murdered by his husband in California. Police filed case on this incident and arrested the Accused person