ట్రంప్‌కు ఇండో అమెరికన్ల మద్దతు

Indo Americans To Support Donald Trump

11:19 AM ON 5th February, 2016 By Mirchi Vilas

Indo Americans To Support Donald Trump

అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్‌ పార్టీ నాయకుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి ఇండో అమెరికన్ల మద్దతు ఇస్తున్నారు. ఇటీవల కీలకమైన ఐయోవా కాకస్‌ ఎన్నికల్లో ట్రంప్‌... సెనేటర్‌ టెడ్‌ క్రుజ్‌ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యూహ్యాంప్‌షైర్‌లో ఇండో అమెరికన్స్‌ ట్రంప్ కు మద్దతుగా ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇండియన్‌ అమెరికన్స్‌ ఫర్‌ ట్రంప్‌ 2016 అనే పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ ఏర్పాటైంది. న్యూజెర్సీలో సమావేశమైన వీరు ట్రంప్‌కి ఓటు వేయాల్సిందిగా న్యూ హ్యాంప్‌షైర్‌లో ఇండో అమెరికన్‌ ప్రజలను చైతన్య పరచాలని నిర్ణయించారు. మీడియాలో ప్రకటనలు ఇవ్వడం, వ్యాసాలు రాయడం, ప్రచారం చేయడం... తదితర కార్యక్రమాల ద్వారా ప్రజలను చేరాలని భావిస్తున్నారు.

English summary

Republican presidential frontrunner Donald Trump as the “best hope for America”, some Indian-Americans in the New York Tristate area have formed a Political Action Committee (PAC) to support and raise funds for him.