తల్లే చంపేసింది ... ఔను చంపేశారట

Indrani strangled Sheena Bora in car

11:03 AM ON 2nd July, 2016 By Mirchi Vilas

Indrani strangled Sheena Bora in car

దేశవ్యాప్తంగా సంచలన కలిగించిన షీనాబోరా హత్యకేసు కొలిక్కివచ్చింది. షీనా బోరాను ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా హత్య చేసిందని అప్రూవర్ గా మారిన డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ చెప్పాడు. 2012, ఏప్రిల్ 24న కారులో షీనాకు చంపామని, ఇంద్రాణికి తాను, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా సహకరించామని ఒప్పుకున్నాడు. తాను షీనా నోరు మూసేయగా, ఖన్నా ఆమె జట్టు పట్టుకుని కదలకుండా ఉంచాడని, ఇంద్రాణి తన చేతులతో కూతురు షీనా గొంతు పిసికేసిందని వెల్లడించాడు.

అయితే, ఈ హత్యలో పీటర్ ముఖర్జియా ప్రమేయం శ్యామ్ వర్ రాయ్ ఏమీ చెప్పలేదు. అక్రమ ఆయుధాల కేసులో శ్యామ్ వర్ రాయ్ అరెస్ట్ కావడంతో 2015లో ఈ హత్యోదంతం వెలుగు చూసింది. షీనా హత్య కేసులో రాయ్, ఇంద్రాణి, ఖన్నాను 2015 ఆగస్టులో అరెస్ట్ చేశారు. నవంబర్ లో పీటర్ ముఖర్జియాను అదుపులోకి తీసుకున్నారు. హంతకుల్లో ఒకరు అప్రూవర్ గా మారడానికి కోర్టు అనుమతినిచ్చి నిచ్చింది కూడా.

ఇవి కూడా చదవండి:కెనడా ప్రధాని భార్య చేతిలో ఒబామా..

ఇవి కూడా చదవండి:టాయ్లెట్ కట్టుకుంటే 'కబాలి' టికెట్ ఫ్రీ

English summary

Another Twist in Sheena Bora Murder Case. Confesses Driver Shaymvar Rai accepted that Sheena Bora was murdered by Indrani by strangled in a car.