ఇన్‌ఫోకస్‌ నుంచి బింగో 21

InFocus Bingo 21 Smartphone

11:16 AM ON 6th February, 2016 By Mirchi Vilas

InFocus Bingo 21 Smartphone

అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఇన్‌ఫోకస్‌ మరో కొత్త ఫోన్‌ను భారత్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇన్‌ఫోకస్‌ బింగో 21 పేరుతో ఈ స్మార్ట్‌ఫోనును అందుబాటులోకి తెచ్చింది. ఫ్లాష్ తో సెల్ఫీ కెమెరాను కూడా అందిస్తున్న ఈ ఫోన్ ధర రూ.5,499. నీలం, తెలుపు, నారింజ రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ లభ్యం కానుంది. ప్రముఖ దేశీయ ఆన్ లైన్ రిటైల్ స్టోర్ స్నాప్ డీల్ తో పాటు ఇన్‌ఫోకస్‌ సొంత వెబ్‌సైట్‌ నుంచి ఈ ఫోన్ ను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ నెల 11 నుంచి అమ్మకాలు మొదలుకానున్నాయి.

బింగో 21 ఫీచర్లు ఇవే..

4.5 అంగుళాల డిస్‌ప్లే, 1.5 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌, 8 మెగాపిక్సల్‌ వెనుక కెమెరా, 5 మెగా పిక్సల్‌ ముందు కెమెరా, 5.1 ఆండ్రాయిడ్‌ సిస్టమ్‌, 2 జీబీ రామ్‌, డ్యూయల్‌ సిమ్‌ సదుపాయం

English summary

America's popular Electronics Compqany InFocus Launched a new Smartphone named InFocus Bingo 21.The price of this smartphone was Rs. 5,499 and it comes with the key features like 4G, 2GB of RAM,1.5GHz quad-core Processor,4.5-inch display, 8-megapixel rear camera, 5-megapixel front camera, 2300mAh battery