13 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఇన్‌ఫోకస్ ఎం680

InFocus New Smart Phone InFocus M680

05:19 PM ON 14th December, 2015 By Mirchi Vilas

InFocus New Smart Phone InFocus M680

అమెరికాకు చెందిన ఎలక్రానిక్ వస్తువుల తయారీ సంస్థ ఇన్‌ఫోకస్ కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇన్ ఫోకస్ ఎం680 పేరిట తాజాగా విడుదల చేసిన ఈ ఫోన్ రూ.10,999కి వినియోగదారులకు లభ్యం కానుంది. స్నాప్‌డీల్ సైట్ ద్వారా ఈ మొబైల్ ప్రత్యేకంగా లభిస్తోంది. సెల్ఫీలను ఇష్టపడేవారి కోసం ప్రత్యేకంగా 13 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేయడం, 4జీ సదుపాయం ఇందులో ప్రత్యేకతలు. ప్రస్తుతం ఈ ఫోన్ గోల్డ్, సిల్వర్ రంగుల్లో లభిస్తోంది.

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080X1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 13 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ, 2600 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మెమరీని 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. దీనికి ఆండ్రాయిడ్ మార్ష్ మాలో అప్ డేట్ అందించనున్నట్టు ఇన్ ఫోకస్ ప్రకటించింది.

English summary

InFocus launched a new smart phone in India Called the InFocus M680, the highlights of the handset are its 13-megapixel front-facing camera, and 4G capability