ఆ ఉద్యోగి ఆచూకి దొరికింది      

Infosys Employee Found Ganesan Found In Belgium

05:52 PM ON 24th March, 2016 By Mirchi Vilas

Infosys Employee Found Ganesan Found In Belgium

బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో రెండు రోజుల కిందట కనిపించకుండా పోయిన భారత్‌కు చెందిన ఇన్ఫోసిస్‌ ఉద్యోగి రాఘవేంద్రన్‌ గణేశ్‌ ఆచూకీ దొరికింది. అతని ఆచూకీని కనిపెట్టామని, అతడు మెట్రో రైలులో ప్రయాణించాడని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్వీట్‌ చేశారు.

బెంగళూరుకు చెందిన గణేశ్‌ గత నాలుగేళ్లుగా బ్రస్సెల్స్‌లోని ఇన్ఫోసిస్‌ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. కాగా.. మంగళవారం ఉదయం బ్రస్సెల్స్‌ విమానాశ్రయం, మెట్రోస్టేషన్లో బాంబు దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగినప్పటి నుంచి గణేశ్‌ కనిపించడం లేదు. దీంతో అతడి కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోగణేశ్‌ సోదరుడు బ్రస్సెల్స్‌ చేరుకుని భారత కార్యాలయ అధికారులతో సంప్రదింపులు అనంతరం భారత దౌత్యాధికారులు గణేశ్‌ ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అతడి చివరి ఫోన్‌కాల్‌ను ట్రాప్‌ చేయడంతో అతడు మెట్రోరైలులో ప్రయాణించినట్లు వెల్లడైందని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ తెలిపారు. ఇక అతడిని కలిసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

బ్రస్సెల్స్లో భారతీయుడు మిస్ అయ్యాడు

ప్రేమలో ఎందుకు పడతారు..?

వేడి నీటిని త్రాగటం వలన ఊహించని లాభాలు

1 4 4 w w w... థ్రిల్లింగ్ ఓవర్ (వీడియో)

English summary

Sushma Swaraj has tweeted that Infosys employee named Ganesan was traced out by his phone cal list in Belgium.Recently he was missed from the time of Terrorist Attack in Belgium capital.