బ్రస్సెల్స్లో భారతీయుడు మిస్ అయ్యాడు

Infosys Employee Misses After Terrorist Attack In Belgium

11:21 AM ON 24th March, 2016 By Mirchi Vilas

Infosys Employee Misses After Terrorist Attack In Belgium

ఎవరా భారతీయుడు! మిస్ అవ్వడమేమిటి , పైగా అక్కడెక్కడో ఉన్న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో మిస్ అవ్వడం ఏమిటి అనుకుంటున్నారా? అనుమానం రావడం సహజం ... కానీ, అక్కడ మొన్న జరిగిన ఉగ్రవాద దాడి బ్రస్సెల్స్ నగరాన్ని వణికించిన సంగతి తెల్సిందే. ఎయిర్ పోర్ట్ , రైల్వే స్టేషన్ లలో బాంబు పేలుళ్లు సంభవించి, 35మంది వరకూ ప్రాణాలు కోల్పోగా , పలువురు గాయపడ్డారు. అయితే ఈ ఉగ్రదాడిలో భారతీయలు క్షేమమని ముందు ప్రకటించినా ఇప్పడు మనవాడు ఒకడు మిస్ కావటం ఆందోళన కల్గిస్తోంది.

బ్రస్సెల్స్ లో పేలుళ్లు చోటు చేసుకోవటానికి గంట ముందు తన తల్లితో మాట్లాడిన రాఘవేంద్ర గణేశన్ ఆచూకీ ఇప్పుడు తెలియటం లేదు. బ్రస్సెల్స్ నగరంలోని ఇన్ఫోసిస్ లో రాఘవేంద్ర గణేశన్ పని చేస్తున్నారు. పేలుళ్ల అనంతరం అతని ఆచూకీ లభించటం లేదు. అతని జాడను తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అలాంటివేమీ ఫలించటం లేదు. అతని మిత్రులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఫలితం కనిపించలేదు. బ్రస్సెల్స్ పేలుళ్ల బాధితుల్లో మనోళ్లు ఎవరూ లేరని చెప్పినా.. జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది గాయపడటం.. వారికి మెరుగైన వైద్యం అందేలా కేంద్రం చర్యలు తీసుకుంది. అయితే.. రాఘవేంద్ర గణేశన్ మిస్ కావటం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. అతడి ఆచూకీ కోసం ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేకపోవటం అతడి తల్లిదండ్రులు.. బంధువులు.. స్నేహితులు.. తెలిసిన వారందరినీ కలవర పరుస్తోంది.

ఫ్రెండ్‌ భార్యతో సెక్స్‌ వీడియో విలువ 700 కోట్లు!

అఫ్రిది వ్యాఖ్యలపై బీసీసీఐ ఫైర్‌

అబ్బాయికి గర్భ సంచి..

నాగ్ చెప్పిన ఊపిరి రహస్యాలు

మగువలు అమితంగా ఇష్టపడే సెలబ్రిటీ ఎవరో తెలుసా?

English summary

Infosys employee named Ganeshan misses after terrorist attack in Belgium Capital City.Till now Police did not get the information of Ganeshan.