చనిపోయిన స్వాతి మాట్లాడుతోంది ... ఇదో మరణ మృదంగం

Infosys employee Swathi whatsapp Message Goes Viral

02:54 PM ON 28th June, 2016 By Mirchi Vilas

Infosys employee Swathi whatsapp Message Goes Viral

మనిషి చనిపోయాక మాట్లాడతాడా అంటే అవుననేలా ఉంది ఈ ఘటన. చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్ లో గత శుక్రవారం ఐటీ ఉద్యోగిని స్వాతి దారుణహత్యకు గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా పలువురిని కలచివేసిన విషయం తెలిసిందే. అయితే, ‘నేను స్వాతిని మాట్లాడుతున్నాను’ అంటూ ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో ఓ సందేశం హల్ చల్ చేస్తోంది. ఇది పలువురి మనస్సులను తాకుతోంది. మరి ఇది ఎలా సాధ్యం... కానీ ఇదో ఊహాజనిత సందేశం. అందరి హృదయాలను కదిలించే ఈ సందేశం కనువిప్పు కల్గించేలా ఉంది. వాట్సాప్ గ్రూపుల్లో ‘నేను స్వాతిని మాట్లాడుతున్నాను’ అంటూ తమిళంలో వినిపించే ఓ గళం హల్ చల్ చేస్తోంది. అందులో కొనసాగే విషయం ఇలా ఉంది ... ‘చనిపోయిన నేను ఇంకా కొద్దిరోజులు ప్రసార మాధ్యమాల ద్వారా మీ మధ్య జీవిస్తూనే ఉంటాను. అంతకుముందు మీతో కొన్ని విషయాలు మాట్లాడి వెళ్లాలని ఆశిస్తున్నాను. అందరిలాగే కలలతో జీవితాన్ని ప్రారంభించిన సమకాలీన సమాజంలో నేను ఒకవ్యక్తిని. ఈరోజు నేను ఎప్పటిలాగే ఉద్యోగానికి బయలుదేరాను, వారాంతపు రోజులను ఆనందంతో గడపాలని భావించే కలతో... మా నాన్న కూడా అలాగే భావించి నన్ను రైల్వేస్టేషన్లో దిగబెట్టి వెళ్లారు. మీలో ఎంతమంది ఈ రోజు ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసి ఉంటారనే విషయం నాకు తెలియదు. అయితే అది మీ మనస్సాక్షికి తెలుసు. మీలో ఎంతమంది మహిళా సాధికారత కోసం నోరు చిరిగేలా మాట్లాడి ఉంటారో నాకు తెలియదు. ఈరోజు నేను నోరు చిరిగే ఉన్నాను. అయితే మీలో ఒకరికి కూడా దానిని (హత్యను) అడ్డుకోవాలనే ఆలోచన రాలేదు. అతడు (హంతకుడు) వెళ్లిన తర్వాత నాకు చికిత్స అందించడానికో లేక నా దాహార్తిని తీర్చడానికో ఒక్కరూ ముందుకు రాలేదు. రెండు గంటల పాటు నన్ను చోద్యం చూసిన దృశ్యాలు మిమ్మల్ని దహించలేదా? ఆడపిల్లలు బయటకు వెళ్లేటప్పుడు ‘చూసి వెళ్లు’ అని చెప్పే మీరు దానిని మగపిల్లలకు కూడా చెప్పండి. మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాలను మొగ్గ దశలోనే తుంచేయండి’... అంటూ స్వాతి గళం సాగుతోంది. దీంతో పలువురి హృదయాలు ద్రవిస్తున్నాయి.

ఇది కూడా చూడండి: మహా భారత యుద్ధం తర్వాత అసలేం జరిగింది

ఇది కూడా చూడండి: వాట్సప్ లో ఈ ఫీచర్స్ మీకు తెలుసా

ఇది కూడా చూడండి: తిరుమలలో రహస్య వైకుంఠ గుహ ఎక్కడుందంటే...

English summary

Swathi employee of Infosys was hacked to death at Chennai’s Nungambakkam railway station. Murder happened in a broad daylight which in turn raised the questions. Infosys employee,