ఇన్నోవేటివ్ ఐడియాలకు రివార్డులు

Infosys to reward for Innovative Ideas

10:54 AM ON 13th February, 2016 By Mirchi Vilas

Infosys to reward for Innovative Ideas

ఇన్నోవేటివ్ బిజినెస్ ఐడియాలకు రివార్డులు ఇవ్వాలని ప్రముఖ దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ నిర్ణయించింది. వినూత్న వ్యాపార ఆలోచనతో ముందుకొచ్చిన 20 మంది వ్యాపారవేత్తలకు నగదు బహుమానం అందించనున్నట్లు ప్రకటించింది. నిజ జీవిత సమస్యలకు పరిష్కారం చూపేలా ఉన్న వినూత్న వ్యాపార ఆలోచనలకు ప్రతి ఏడాది రివార్డులు ఇస్తామని సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ రావ్‌ వెల్లడించారు.

ఇన్ఫోసిస్‌ మేకర్‌ అవార్డు కోసం ఎవ్వరైనా వ్యక్తిగతంగా తమ వినూత్న వ్యాపార ఆలోచనలను ఇన్ఫోసిస్‌కు పంపిచవచ్చని, జ్యూరీ వారి ఐడియాలను పరిశీలిస్తుందని తెలిపారు. వినూత్నంగా, తాజా సమస్యలకు పరిష్కారం చూపేలా ఉన్న ఐడియాలకు రివార్డు ఇచ్చి ప్రోత్సహిస్తామని తెలిపారు. అన్ని సెక్టార్ల నుంచి ఎంట్రీలను ఆహ్వనిస్తున్నారు. 20 మందిని ఎంపిక చేసి రూ.5లక్షల చొప్పున ఇస్తారు.

English summary