శక్తి మాన్ ఇక లేదు

Injured Horse Shaktiman died in Dehradun

12:49 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Injured Horse Shaktiman died in Dehradun

ఎవరీ శక్తి మాన్ అనుకుంటున్నారా? గత నెలలో ఉత్తరాఖండ్ లో జరిగిన ఆందోళన సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యే దాడికి గురై గాయపడిన శక్తి మాన్ పోలీస్ గుర్రం అండీ ... పాపం బుధవారం అది ప్రాణాలు విడిచింది. గత మార్చి 14 న బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషీ లాఠీ తో కొట్టగా ఈ అశ్వం కాలికి గాయమై డాక్టర్లు ఆ కాలును తొలగించాల్సి వచ్చింది. దీంతో ఆపరేషన్ చేసి.. యూఎస్ నుంచి తెప్పించిన కృత్రిమ కాలును దానికి అమర్చారు. డెహ్రా డూన్ లో అప్పటినుంచి ఇది నొప్పితో బాధపడుతూ వచ్చిందని, చికిత్సకు స్పందించక చివరకు మరణించిందని తెలిసింది. శక్తిమాన్ మృతికి చలించిపోయిన కేంద్ర మంత్రి మేనకా గాంధీ.. ఈ గుర్రాన్ని డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ గా అభివర్ణించారు. దీనినెంతో బాధకు గురి చేసి దీని మృతికి కారకుడైన గణేష్ జోషీని మళ్ళీ అరెస్టు చేయాలని ఆమె అన్నారు. 13 ఏళ్ళ శక్తిమాన్ నాలుగేళ్ల వయస్సు నుంచే పోలీసు దళానికి తన సేవలందిస్తూ వచ్చింది. ఇటీవలే అమెరికాకు చెందిన ఓ వ్యక్తి చలించిపోయి , కృత్రిమ కాలు కూడా తెచ్చి ఇచ్చిన సంగతి తెల్సిందే. అయినా శక్తి మాన్ ఈ లోకం వీడింది.

ఇవి కూడా చదవండి :

శృంగారం కోసం వ్యాపారం పెట్టాడు.. ఇప్పుడు కోట్లు కురిపిస్తుంది

అలాంటి సినిమాల్లో నటించాలనుంది

ఆ కారు డ్రైవర్ ఆస్తి 600 కోట్లు

English summary

Horse named Shaktiman which was severely injured in BJP MLA Attack was lost its leg and later an American Donated Artificial leg to that horse but due to sever pain Shaktiman died yesterday in Dehradun. Central Minister Menaka Gandhi demanded to arrest that BJP MLA who was the reason for Shaktiman Death.