దెబ్బ తగిలినా..   వారికి తెలియదట .!

Injury Doesn’t Hurt Sleep Walkers

06:16 PM ON 12th November, 2015 By Mirchi Vilas

Injury Doesn’t Hurt Sleep Walkers

తల పగిలి పోయినా.. కాళ్ళు..చేతులు విరిగి పోయినా వాళ్ళకు తెలియదు. వాళ్ళు ఎవరో కాదండీ.. స్లీప్ వాకర్స్ .

నిద్రలో నడిచే అలవాటు ఉన్న వాళ్ళని మనం చాలా మందిని నిత్యం చూస్తునే ఉంటాం. సాధారణంగా దెబ్బ తగిలితేనే మనం విలవిలాడి పోతాం , ఐతే నిద్రలో అలా నడిచేటప్పుడు ఎదైనా దెబ్బ తగిలితే వాళ్లకి ఏమవుతుందని మనం అనుకుంటువుంటాం. ఈ ప్రశ్నకు లండన్ పరిశోధకులు సమాధానం చెప్పారు.

సాధారణంగా నిద్రలో నడుస్తున్నప్పుడు ఏం జరిగినా నొప్పి తెలియదట, అంతేకాక నిద్రలో నడుస్తు వెళ్లి భవనం ఫై నుండి పడినా , కాలు విరిగినా వెంటనే నొప్పి తెలియదట. వారు నిద్రలోనుండి లేచిన తరువాత మాత్రమే ఆ గాయం తాలూకు నొప్పి తెలుస్తుందట . . ఈ విషయాన్ని నిద్రలో నడిచే అలవాటు వున్న 55 మంది పురుషులు , 45 మంది మహిళల పై అధ్యయనం చేసి పరిశోధకులు కనుగొన్నారు .

English summary

Injury Doesn’t Hurt Sleep Walkers