బార్లలో తనిఖీలు

Inspection in Bars in A.p

01:01 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Inspection in Bars in A.p

విజయవాడ కృష్ణ లంక స్వర్ణ బార్ లో మద్యం సేవించి 5గురు మరణించగా , 20 మంది అస్వస్థతకు గురైన నేపధ్యంలో ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. ఆ శాఖ కమీషనర్ ఎం కె మీనా ఆదేశాల మేరకు ఎపిలోని బార్లలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కృష్ణ లంక వ్యవహారంలో 9 మంది పై కేసు నమోదు చేసారు. 9వ నిందితుడిగా మాజీ ఎం ఎల్ ఎ , కాంగ్రెస్ సీనియర్ నేత మల్లాది విష్ణు పేరు చేర్చారు. కాగా ఎపి డిజిపి జెవి రాముడు మంగళవారం కృష్ణ లంకలోని స్వర్ణ బార్ ని పరిశీలించారు. ఈ ఘటనలో బాధితులను పరామర్శించారు.

కల్తీ మద్యం నేపధ్యంలో కొన్ని బ్రాండ్లను నిషేధించారు.ఇప్పటివరకు టార్గెట్లు పెట్టిన అధికారులు ఇప్పుడు అప్రమత్తతతో వ్యవహరిస్తుండడంతో పరిస్థితిలో మార్పు వస్తుందా ? ఒక వేళ వస్తే , ఎలాంటి కొత్త విధానం రూపుదిద్దుకోనుందో వేచి చూడాల్సిందే.

English summary

Andhrapradesh exercise department inspecting the bars in all over A.p due to the incident that occuured recently in Viajayawada