'రోబో 2.0' కి ఇన్సురెన్స్

Insurance for Robo 2 movie

03:50 PM ON 18th March, 2016 By Mirchi Vilas

Insurance for Robo 2 movie

దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్టైలే కాదు, సినిమా కూడా వెరైటీ గానే వుంటుంది. అంతేకాదు రజనీ సినిమా అంటేనే ఓ సంచలనం. ఏదో కొత్తదనం ఖచ్చితంగా ఉంది తీరుతుంది. ఇక రజనీ-శంకర్‌ల కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న ‘రోబో 2.0’ గురించి కూడా రజనీ అభిమానులు ఇంతే ఆసక్తికరంగా మాట్లాడుకొంటున్నారు. అదేమిటంటే, ‘రోబో 2.0' కి సంబంధించి చిత్రబృందం ఇన్సూరెన్స్‌ పాలసీ చేయించిందట. ఏకంగా రూ.350 కోట్ల రూపాయలకు పాలసీ చేయించినట్లు వినికిడి. సాధారణంగా హాలీవుడ్‌ చిత్రాలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇలా ఇన్సూరెన్సు చేయిస్తుంటాయి. బాలీవుడ్‌లో అడపాదడపా ఇన్సూరెన్స్‌ పాలసీలవైపు నిర్మాతలు మొగ్గు చూపుతున్నా... దక్షిణాదిన ఓ సినిమా ఇన్సూరెన్సు చేయించుకోవడం ఇదే తొలిసారి.

అదీ.. ఇంత భారీ మొత్తానికి. ‘రోబో 2.0’ రూ.350 కోట్ల వ్యయంతో తెరకెక్కుతోందట. అందుకే అంతే మొత్తానికి బీమా చేయించారని తెలుస్తోంది. ఇదో రికార్డుగా తమిళ చిత్ర వర్గాలు చెప్పుకొంటున్నాయి. ఇక ఈ సినిమా రేంజ్ కూడా అంచనాలకు అందని విధంగా ఉంటుందని అంటున్నారు. ఏం చేసినా రజనీ కే చెల్లిందని అభిమానులు తెగ సంబరంతో చెప్పేసుకుంటున్నారు. ఈ చిత్రంతో పాటు రజని కాంత్ పి.ఎ. రంజిత్ కుమార్ దర్శకత్వంలో 'కబాలి' చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇందులో రజని ఒక డాన్ గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో రజని సరసన రాధిక ఆప్టే, ధన్సిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.

రోబో 2.0 గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు

1/5 Pages

నిర్మాత:

ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఒక్కటే 350 కోట్లు మొత్తంతో నిర్మిస్తున్నారు.

English summary

Insurance for Robo 2 movie. South Indian Super Star Rajinikanth upcoming movie is Robo 2.0. This movie is directing by Shankar. British Beauty Amy Jackson is acting as a heroine in this movie.