పెళ్లి ప్రస్ధావన రాగానే అమ్మాయిలు చెప్పే తెలివైన సాకులు

Intelligent reasons by indian women to escape from marriage

12:44 PM ON 7th October, 2016 By Mirchi Vilas

Intelligent reasons by indian women to escape from marriage

గతంలో పిల్లలకు ఎప్పుడు పెళ్లిళ్లు చేయాలో పెద్దలు నిర్ణయించేవారు. వారి నిర్ణయానికి, దానికి కట్టుబడి ఉండడం జరిగేది. అయితే ఇప్పుడు చదువులకు తొలిప్రాధాన్యత ఇవ్వడం అందరి ఇళ్లల్లో కనిపిస్తోంది. ఇక చదువుకున్నాక తమకు ఇష్టమైన వాళ్ళని పెళ్లాడడానికి పిల్లలు నిర్ణయించుకుంటే, పెద్దలు ఒప్పుకోక తప్పడం లేదు. లేదంటే ఏమి జరుగుతుందో వాళ్లకి తెలుసు కూడా.. ఇక ఈ కాలంలో అమ్మాయిల దగ్గర పెళ్లి మాట ఎత్తితే ఎదో సాకు చెప్పి వాయిదా వేస్తున్నారని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వివాహ వయసు వచ్చిన యువతులు వివాహాన్ని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా భారతీయ స్త్రీల ఆలోచనల్లో ధృక్పధంలో చాలా మార్పొచ్చింది. అందువల్ల వివాహ విషయంలో కూడా వారి ఆలోచన మారింది. స్త్రీలకి వివాహ వయసు ముప్ఫై ఏళ్ళు లేదా అంతకు పైబడ్డాక ఆ వయస్సులో వివాహం చేసుకోవడం సర్వ సాధారణమైపోయింది. ఇక ఇంట్లో పెళ్ళి పేరెత్తగానే ఈ కాలం యువతులు చూపించే సాకులని ఓసారి చూద్దాం..

1/8 Pages

1. ఇంకా చదువుకోవాలి..


ఇంట్లో పెళ్ళి పేరెత్తగానే పెళ్ళి అప్పుడే చేసుకోకూడదనుకునే ప్రతీ అమ్మాయీ చూపించే కారణం చదువు. తానింకా పెద్ద చదువులు చదవాలనుకుంటోందని చెప్పి పెళ్ళి విషయాన్ని దాటేస్తుంది.

English summary

Intelligent reasons by indian women to escape from marriage