ఎవరీ శరత్ మరార్... పవన్‌కు ఎలా బెస్ట్ ఫ్రెండ్ ఎలా అయ్యాడు

Interesting details about Sharath Marar

10:37 AM ON 23rd March, 2016 By Mirchi Vilas

Interesting details about Sharath Marar

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'. పవన్ కల్యాణ్ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రానికి కె.ఎస్. రవీందర్(బాబీ) దర్శకుడుగా వ్యవహరించారు. ఈ చిత్రానికి పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ చిత్ర నిర్మాత శరత్ మరార్ గత కొంత కాలంగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి బాగా సన్నిహితుడు కాబట్టే అతి తక్కువ సమయంలోనే సెలబ్రిటీ స్టేటస్ ని సొంతం చేసుకున్నాడు. ఒక్క సినిమా తోనే వెలుగులోకి వచ్చేశాడు. అయితే తాజాగా శరత్ మరార్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పవన్‌కు చెక్క గుర్రం వెనుక ఉన్న క్రేజీ కథ

శరత్ మరార్ వెలుగులోకి వచ్చింది ఇప్పుడే కానీ మెగా స్టార్ ఫ్యామిలీ కి శరత్ మరార్ పదిహేనేళ్లు ముందు నుండి తెలుసట. అప్పుడే శరత్ మరార్ పవన్ కల్యాణ్ కి బాగా దగ్గరయ్యాడట. అసలు పవన్ కి-శరత్ మరార్ కి మధ్య స్నేహం ఎలా చిగురించిందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇంకెందుకు ఆలస్యం తెలుసుకోండి మరి.

ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ను గ్యాంగ్ రేప్ చేసారు

శరత్‌ మరార్‌ పుట్టింది పెరిగింది హైదరాబాద్‌ లోనే. అయితే వాళ్ల స్వస్థలం మాత్రం కేరళ. అయితే గత నాలుగు జనరేషన్స్‌ నుండి వీళ్లు హైదరాబాద్‌లో స్థిర పడ్డారు. శరత్‌ మరార్‌ ముత్తాతగారు నైజాం రైల్వేస్‌ లో పని చేసేవారు. శరత్‌ తాతగారు ఆర్మీలో డాక్టర్‌గా పని చేశారు. ఇంకా శరత్‌ తండ్రి రేడియో మరియు టెలివిజన్‌లో పని చేసేవారు. శరత్‌ చదివింది బి.కామ్‌, ఎంబిఏ (ఫైనాన్స్‌). అయితే తన తండ్రి కోరిక మీదుగా శరత్‌ క్రియేటీవ్‌ ఫీల్డ్‌లోకి అడుగు పెట్టాడు. శరత్‌ కి రామ్‌గోపాల్‌ వర్మ డైరెక్టర్‌ కాక ముందే పరిచయం ఉంది. వర్మతో ఎక్కువ సమయం గడిపే వాడు.

ఈ డైరెక్టర్ ను కూడా పవన్ కొట్టాడా?

సన్ స్ట్రోక్ తో రోడ్ మీద పడ్డ బెల్లంకొండ

అయితే అమితాబ్‌ బచ్చన్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌(ABCL) లో శరత్‌ కి అవకాశం రావడంతో అందులోకి వెళ్లాడు. అందులో రెండు సంవత్సరాలు పనిచేసి తరువాత బయటకి వచ్చి సీరియల్స్‌ నిర్మించాడు. ఆ తరువాత చిరంజీవితో స్నేహం కుదరడంతో శరత్‌ మరార్‌ టాలెంట్‌ గుర్తించి శరత్‌ ని మాటీవికి సీఈఓ గా నియమించారు.

1/8 Pages

మెగా ఫ్యామిలీ తో..

మెగా ఫ్యామిలీతో-శరత్ మరార్ కి 15 ఏళ్ల నుండి పరిచయం ఉందట.

English summary

Interesting details about Sharath Marar. Sharath Marar is the best friend of Pawan Kalyan and Mega family. And also he is worked as a Maa tv CEO.