చిలుకూరి బాలాజీ గురించి ఆసక్తికర తెలీని విషయాలు

Interesting Facts About Chilkur Balaji Temple

11:16 AM ON 30th December, 2016 By Mirchi Vilas

Interesting Facts About Chilkur Balaji Temple

తిరుమల శ్రీవారి ప్రత్యేకత ఇక ఎక్కడా కనపడదు. ఎన్నిసార్లు స్వామిని చూసినా తనివితీరదు. అయితే చిలుకూరు బాలాజీ దేవాలయం ఓ డిఫరెంట్ లో కొనసాగుతోంది. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా వెలుగొందుతున్న ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 25 కి.మీ.ల దూరంలో వికారాబాద్ వెళ్లే మార్గంలో ఉంది. భక్తులపాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు నిత్యం పెద్దసంఖ్యలో బాలాజీని దర్శించుకుంటారు. తెలంగాణ తిరుపతిగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్వామివారిని వీసాల బాలాజీ అని కూడా పిలుస్తుంటారు. వారానికి 75 వేల నుంచి లక్షమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇక శుక్ర, శనివారాల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

1/10 Pages

సుమారు 500 ఏళ్ల కిత్రం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి పరమభక్తుడైన గున్నాల మాధవరెడ్డి ఈ చిలుకూరులో ఉండేవాడు. అతను ఏటా ఎంత కష్టమైనా.. కాలినడకన తిరుపతి వెళ్లి, స్వామివారిని దర్శించుకుని వచ్చేవాడు. వృద్ధాప్యంలో సైతం ఆయన వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లి వస్తుండేవాడు.

English summary

Interesting Facts About Chilkur Balaji Temple.