బుద్ధుని గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు

Interesting facts about Gautam Buddha

10:08 AM ON 17th September, 2016 By Mirchi Vilas

Interesting facts about Gautam Buddha

సిద్ధార్థుడు జ్ఞానోదయంతో గౌతమ బుద్ధుడుగా మారాడు. ఈ జగతికి గురువులలో ఒకడిగా మారాడు. చివరకు భౌద్ధ మతం స్థాపించి, శాంతి మార్గాన్ని బోధించాడు. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అంటూ ప్రభోదం చేసాడు. అసలు ఈ ప్రపంచం నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి బుద్ధుడు చిన్న వయస్సులోనే ఇల్లు వదిలిపెట్టి ఆనాడు అమలులో ఉన్న వివిధ మార్గాలు, పద్ధతులని అనుసరించి, అనేక మంది ఆధ్యాత్మిక గురువులతో సాంగత్యం చేసి చివరికి 35 సంవత్సరాల వయస్సులో జ్ఞానోదయం పొందాడు. ప్రపంచమంతా పర్యటిస్తూ భౌద్ధ ధర్మ ప్రచారం చేసి 80 సంవత్సరాల వయస్సులో నిర్యాణమొందాడు.

1/13 Pages

1. మొదట్లో బుద్ధుడు ఆడవారిని సన్యాసాశ్రమంలోకి అనుమతించలేదు. కానీ తనని పెంచి పెద్ద చేసిన మేనత్త తనకి సన్యాసమిమ్మని వచ్చేసరికి కాదనలేక అప్పటినుండీ ఆడవారికి కూడా సన్యాసాశ్రమ ప్రవేశాన్ని కల్పించాడు.

English summary

Interesting facts about Gautam Buddha. 12 interesting facts about Gautam Buddha.