హనుమంతుడి గురించి తెలీని నిజాలు

Interesting facts about Hanuman

11:40 AM ON 31st May, 2016 By Mirchi Vilas

Interesting facts about Hanuman

ఈరోజు హనుమజ్జయంతి... ఆంజనేయుడే హనుమ ... దీనికి సంబంధించి పెద్దలు చెప్పే కధను ఓ సారి పరిశీలిద్దాం ...

1/10 Pages

పండు అనుకుని సూర్యున్ని పట్టుకోవడం ...

ఆంజనేయుడు పెరిగి పెద్ద వాడవుతున్నాడు .ఓ రోజు ఆకలి గా వుందని, ఏమైనా పెట్టమని అమ్మను అడిగాడు. పండిన పళ్ళు చెట్టుకు వుంటాయి కోసుకోమ్మంది. అప్పుడే సూర్యోదయం అవుతోంది అరుణ కాంతితో సుర్యుడు ఉ౦డటం వల్ల పండు గా భావించి ఆకాశానికి ఎగిరి సూర్యున్నిపట్టు కొన్నాడు . .ఆరోజు సూర్య గ్రహణం రాహువు సూర్యుని కబళి౦చాలి .తాను చేయాల్సిన పని ఇతను చేయటం చూసి కోపం వచ్చింది . నేరేడు పండు లాగా నల్ల గా వున్న రాహువుని చూసి పండు అనుకోని పట్టుకో బోయాడు .అతను పారిపోయి ఇంద్రుడికి చెప్పాడు .తెల్లని ఐరావతం ఎక్కి ఆయన వచ్చాడు .దాన్ని కబళించాలని మీదకు దూకాడు. ఇంద్రునికి, ఆశ్చర్యము ,కోపమూ వచ్చి వజ్రాయుధాన్ని ముందుగా తర్వాత బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు .నోటిలో సూర్య బింబాన్ని వుంచుకొనే ఆంజనేయుడు ఆ రెండిటినీ రెండు వెంట్రుకలతో ఎదుర్కొని వాటిని పనికి రాకుండా చేశాడు .దేవతలంతా వచ్చి సూర్యుడు లేక పొతే ప్రపంచానికి చాల నష్టమని ,యజ్ఞాది క్రతువులు చేయటం కుదరదని అతనికి నచ్చ చెప్పారు .వాళ్ల మాట విని తాను నోటితో మింగిన సూర్యున్ని వదిలేశాడు .

English summary

Interesting facts about Hanuman. Hanuman is also called as Anjaneya swami. He is one of the central figures in the Hindu epic Ramayana.