జలకాలాటల పాటలో ఏం చేశారో తెలుసా ?

Interesting Facts About Jalakalatalalo Song

10:45 AM ON 15th September, 2016 By Mirchi Vilas

Interesting Facts About Jalakalatalalo Song

సినిమాలు తీయడంలో నేర్పరితనం ఉండాలి. సమయానుకూలంగా దర్శకుడు వ్యవహరించాలి. లేదంటే, ఇబ్బందులు వస్తాయి. ఆరోజుల్లో దర్శక నిర్మాతలు ఎంతో చాకచక్యంగా వ్యవహరించేవారనడానికి అలాంటి మేటి దర్శకుడు కెవి రెడ్డి ‘జగదేకవీరుని కథ’ సినిమాలో ఓ పాటకు ఎంతో సమయ స్ఫూర్తి ప్రదర్శించారో చూద్దాం. ఈ సినిమా 1961లో వచ్చింది. అసలు ఈ సినిమా షూటింగ్ ఆరంభానికి నాలుగునెలల ముందే, కార్యక్రమాలు, షెడ్యూలు సిద్ధ మయ్యాయట. దీంతో ‘జలకాలాటలలో....’ పాట జనవరిలో షెడ్యూల్ పడింది. కాల్ షీట్ టైము ఉదయం ఏడుగంటలకి అని వుంది. జనవరి అంటే చలిరోజులు. నలుగురు అమ్మాయిలు ఆరున్నరకే రెడీ అయి, ఈతకొలనులోకి దిగాలి. నీళ్లు చల్లగా ఉంటే ఇబ్బందే కదా. అందుకే కెవి రెడ్డి ఓ ఐడియా వేశారు. నీళ్లు వెచ్చగా ఉంటే వాళ్లు హాయిగా దిగుతారు. పైగా చాలాసేపు నీళ్లలో ఉండాలి గనక - ‘ఆ పాట తీసే మూడుపూటలూ వేడి నీరు సరఫరా చెయ్యాలి’ అని నోట్ రాసి, ప్రొడక్షన్ వారికి అందజేశాడు. దీంతో షూటింగ్ వేళకి వెచ్చని నీళ్లు ‘పంపు’ కావడం జరిగింది. దీంతో మూడు పూటల్లో అనుకున్న షూటింగ్ రెండుపూటల్లోనే పూర్తి అయిందట. ఇక ఆపాట ఇప్పటికీ జనం నోళ్ళలో నానుతూనే వుంది.

ఇది కూడా చూడండి: న్యూమరాలజీ ప్రకారం మీ పేరు ఏం చెబుతోంది?

ఇది కూడా చూడండి: ఈ ఈ రాసుల వాళ్ళు వివాహం చేసుకోకూడదట

English summary

Interesting Facts About Jalakalatalalo Song,