కాకతీయుల గురించి ఆసక్తికరమైన విషయాలు 

Interesting facts about Kakatiya Empire

12:57 PM ON 7th May, 2016 By Mirchi Vilas

Interesting facts about Kakatiya Empire

వేయిస్తంబాల గుడికి వెళ్ళినా రామప్ప శిల్పకళాసౌందర్యాన్ని ఆరాధించినా, పాకాలలో తటాక అందాలు వీక్షించినా, లక్ష్మీవరపు నీటి ముచ్చట్లు ఆలకించినా, ఓరుగల్లు కోట గొప్పతనాన్ని తెలుసుకున్నా ప్రతీ ఒక్కటి కాకతీయుల కీర్తినే చాటుతాయి. ఆ చక్రవర్తులు అందించిన జన రంజకమైన పాలనను, శిల్పకళా ప్రతిభను ప్రతిబింభిస్తాయి. ఓరుగల్లులో ఆ రాజులు నిర్మించిన ఆలయాలు, చెరువులు నేటికి కనువిందు చేస్తున్నా వారి నివాసాలు మాత్రం మచ్చుకైనా కన్పించవు. ఇంతకు కాకతీయులు వరంగల్లులోనే ఉన్నారా ? ఓరుగల్లు మహానగరం రహస్యంపై కొన్ని ఆసక్తికరమైన విషయాలు.

ఇది కుడా చూడండి : ఇక్కడ ఆడవాళ్లకు ప్రవేశం లేదు

ఇది కుడా చూడండి : స్త్రీలు చేసేవి చేయకూడనివి

ఇది కుడా చూడండి : వీళ్ళు భక్తుల్లోనే వెరైటీ

1/12 Pages

కాకతీయ వైభవం

కాకతీయులది వైభవోపేతమైన చరిత్ర. అంతటి చరిత్ర కలిగిన వీరి పాలన గురించి తెలిసినట్లుగా వీరి నివాసాల గురించి తెలియదు. వీరి నివాసాల గురించి వివరాలు చరిత్రలో ఎక్కడా లేదు. ఆంద్రప్రదేశానికి ఖండాంతర కీర్తిగా పేరు తెచ్చి పెట్టిన చక్రవర్తులు తమ పాలనలో ప్రజలను కన్న బిడ్డలుగా చూసుకున్న మహానీయులు అడుగడుగునా కట్టడాలతో శిల్పకళా ప్రభోవాన్ని నాటి నుంచి నేటివరకు చాటి చెప్పిన కళా పోషకులు. కాకతీయుల పాలనలో ఓరుగల్లును రాజదానిగా చేసుకుని ఎక్కడ చూసినా జనరంజకమైన పాలనలు అందించిన మహా రాజులు. అటువంటి కాకతీయులు ఎక్కడ ఉండేవారు అసలు వాళ్ళ నివాసాలు ఎక్కడుండేవి అనే విషయాలు ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్నాయి. 

English summary

Here interesting facts about kakatiya empire. Kakatiya dynasty was a South Indian dynasty whose capital was Orugallu, now known as Warangal.