మహిమ గల ఆంజనేయుడు .. అందుకే కసాపురం వెళ్లాల్సిందే

Interesting Facts About Kasapuram Anjaneya Temple

10:53 AM ON 4th January, 2017 By Mirchi Vilas

Interesting Facts About Kasapuram Anjaneya Temple

శ్రీరామ భక్త హనుమాన్ కి ఇప్పుడు అన్ని చోట్లా విగ్రహాలు వచ్చేస్తున్నాయి. కొన్నిచోట్ల భారీ విగ్రహాలు కూడా పెడుతున్నారు. ప్రముఖ ఆంజనేయ ఆలయాలు కూడా వున్నాయి. అందులో ముఖ్యంగా అనంతపురం జిల్లా కసాపురంలో వెలిసిన హనుమంతుడు భక్తుల కోరికలను తీర్చుతూ వారిపై చల్లనిచూపును ప్రసరిస్తున్నాడు. శ్రీ ఆంజనేయస్వామి భవిష్యత్ బ్రహ్మ. ధర్మాన్ని, సత్యాన్ని ఆచరించడంలో ఆయన నిష్టాగరిష్టుడు. శ్రీరామనాప జపం విన్నంత మాత్రానే ఆయన ప్రసన్నుడవుతాడు. దేశం నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు తమను కష్టాల నుంచి గట్టెక్కించమని, తమను, తమ కుటుంబాల్లోని వారిని ఎల్లవేళలా చల్లగా ఉండేలా దీవించమని ఆ దేవుడిని వేడుకుంటారు. ఆ స్వామిని దర్శిస్తే సకల పాపాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం. మనసులో అనుకున్న కోర్కెలు నెరవేరుతాయని, ఏ పనులు ప్రారంభించినా విఘ్నం లేకుండా ముందుకు సాగుతాయని, సర్వరోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామిని దర్శించటం మహాభాగ్యంగా భక్తులు తలుస్తారు. అలాంటి సర్వమంగళ స్వరూపుడు, అనాథ రక్షకుడు, ఆపద్బాంధవుడే కసాపురంలో వెలిసిన నెట్టికంటి ఆంజనేయస్వామి. పూర్తివివరాల్లోకి వెళదాం.

1/8 Pages

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కసాపురంలో ఆంజనేయస్వామి దేవస్థానంఉంది. ఉగాది పండుగ సందర్భంగా ఆలయంలో మూడు రోజుల పాటు ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి. కోరిన వరాలు ఇచ్చి ప్రజలకు ఇలవేల్పు అయిన స్వామివారి గుడి నిర్మాణానికి ఘనమైన చరిత్ర ఉంది. ఇక్కడి జానపదాల నుండి వినిపించే కథల్ని చూస్తే, ఆ విషయం తేటతెల్లమవుతుంది.

English summary

Here Some Interesting Facts About Kasapuram Anjaneya Swamy Temple.