శ్రావణ పౌర్ణమి - రాఖీ పౌర్ణమి గురించి తెలీని నిజాలు

Interesting Facts About Raksha Bandhan

11:41 AM ON 18th August, 2016 By Mirchi Vilas

Interesting Facts About Raksha Bandhan

మన సంప్రదాయంలో ఎన్నో విశిష్టతలు వున్నాయి. శాస్త్రీయ దృక్పధం జోడించి ఆయా రోజుల్లో కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటి అయింది. ఇక శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత వుంది. జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని శ్రావణ పౌర్ణమికి పేర్లున్నాయి. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఓ పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం.

ఇక శ్రావణ మాసంలో వచ్చే పున్నమిని రాఖీ పౌర్ణమి, శ్రావణ పున్నమి పేరిట ఎన్నోరకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దేవతారాధనలు, ప్రకృతి దేవతారాధనలు, ఆత్మీయతానురాగబంధాలు... సకల పూజారాధనలు అందుకునే రోజు ఈ శ్రావణ పౌర్ణమి.

1/7 Pages

కజరి పూర్ణిమ ...

శ్రావణంలో అధికంగా వానలు కురుస్తూ, ప్రకృతి కొత్త అందాలతో, పచ్చని పైరు పంటలతో ఆహ్లాదకరంగా వుంటుంది. రైతన్నలపాలిట వరం ఈ శ్రావణ వున్నమి. పంటలు బాగా పండాలని, సిరులు నిండాలని పుడమి తల్లికి పూజచేసి నార్లు నాటే సమయం ఇది. దీన్నే కజరి పూర్ణిమ అంటారు.

English summary

Raksha Bandhan is the festival which was celebrated in whole India. This is the festival of Brother and Sister.