సూర్యనార్ కోవిల్ లో సూర్యుని ప్రత్యేకతలు ఏమిటో తెలుసా

Interesting Facts About Suryanar Kovil

12:29 PM ON 14th December, 2016 By Mirchi Vilas

Interesting Facts About Suryanar Kovil

దేవుడున్నాడా లేదా అని నిత్యం వాదించుకునేవాళ్ళు చాలామంది వున్నారు. అయితే కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యుడే. నవగ్రహాల్లో సూర్యభగవానుడిది కీలకస్థానం. యావత్ ప్రపంచానికి వెలుగులు ప్రసారింప చేస్తూ జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తాడు. నవగ్రహ స్తోత్రంలో ఆదిత్యయాచ అంటూ మొదట సూర్యదేవుడినే ప్రార్థిస్తాం. ఇక సూర్యనారాయణ మూర్తికి చాలాచోట్ల ఆలయాలున్నాయి. అయితే సూర్యభగవానుడు ఇతర గ్రహాలతో కలిసి ప్రతిష్టితమైన దివ్య క్షేత్రం ఒకటి వుంది. అదే తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని సూర్యనార్ కోవిల్ . ఇక్కడి విశేషాలు తెలుసుకుందాం.

1/16 Pages

1. ఈ క్షేత్రానికి సంబంధించిన స్థలపురాణం ప్రకారం కాలవముని అనే యోగి కుష్టువ్యాధితో బాధపడేవాడు. తనకు బాధ నుంచి విముక్తి కలిగించమని కలిగించమని అతను నవగ్రహాలను ప్రార్థించాడు. దీంతో అనుగ్రహించిన గ్రహాధిపతులు అతనికి ఆ వ్యాధి నుంచి విముక్తి కలిగించారు. దీనిపై సృష్టికర్త బ్రహ్మ ఆగ్రహం వ్యక్తంచేశాడు. మానవుల్లో మంచి, చెడులకు సంబంధించిన ఫలితాలను ఇవ్వడమే గ్రహాల పని అని పేర్కొంటూ తమ పరిధిని అతిక్రమించిన గ్రహాలను భూలోకంలోని శ్వేత పుష్పాల అటవీప్రాంతానికి వెళ్లిపొమ్మని శాపం పెడుతాడు.

English summary

Suryanar Kovil in Thanjavur district of Tamil Nadu. Here placed some Interesting Facts About Suryanar Kovil.